active voice and passive voice, learn English through Telugu

active voice and passive voice, learn English through Telugu

 Active voice and passive voice ఈ రెండిటికీ ఒకే అర్థాలు వస్తాయి కానీ వేరు వేరు అర్థాలు రావు.
 రెండింటికి ఒకటే అర్దాలు వచ్చినప్పుడు వీటిని నేర్చుకోవడం దేనికి అని మీకు ఒక డౌట్ రావచ్చు.
 కొన్ని కొన్ని వాక్యాలను passive voice లోనే మాట్లాడవలసి వస్తుంది. అందువలన మనం passive voice ని ఖచ్చితంగా నేర్చుకోవాలి.
 కొన్ని మాటలను Active voice లోను passive voice లోను మాట్లాడవలసి వస్తుంది.

రామ రావణుని చంపాడు.
 Rama killed Ravana    ( active voice )

Ravana was killed by Rama (passive voice)

 Passive voice లో verb3 ని మాత్రమే వాడుతాము.

 ఎటువంటి సందర్భాలలో passive voice ని ఉపయోగిస్తాము.?

 Subject ఎవరో పూర్తిగా తెలియనప్పుడు, object ఎవరో తెలిసినప్పుడు.
 ఉదాహరణకు గమనించండి.
 10 వ తరగతి ఫలితాలు ప్రకటించాడు,
 ఎవరు ప్రకటించారు?
ఈ వాక్యంలో subject లేదు.
దేనిని వేటిని ప్రకటించారు?
 ఫలితాలును అనగా object స్పష్టంగా ఉంది.
 Subject ఎవరో తెలియనప్పుడు, subject ఎవరో తెలిసిన మెన్షన్ చేయాల్సిన అవసరం లేనప్పుడు,
 పూర్తిగా objective point లోనే మాట్లాడినప్పుడు.

 ఇటువంటి సందర్భాలలో passive voice ని ఉపయోగిస్తాము.

Simple present          : am, is are
Simple past                : was, were
Simple future             : be
Present continuous  : being
Past continuous        : being
Present perfect          : been
Past perfect                : been
Future perfect            : been

Simple present tense:am, is, are
 సీత సావిత్రిని లవ్ చేస్తుంటుంది.
 Sita loves Savitri.

 సీత అనేది subject ,  సావిత్రి అనేది object.
 Passive voice లో  object subject గా మారుతుంది. Verb 3 ని వాడాలి.

 Savitri is loved by Sita.

 అతను పాలు  అమ్ముతుంటాడు.
 He sells milk        (active voice)

 ఇందులో కచ్చితంగా తెలుస్తుంది, పాలు ఎవరు అమ్ముతున్నాడు అని, అతను పాలు అమ్ముతున్నాడని కచ్చితంగా తెలుస్తుంది. ఇలాంటప్పుడు మనం సాధారణంగా Active voice ని use చేస్తాం. కాని 

ఇక్కడ పాలు అమ్మబడును.
Milk is sold here.
అనగా ఇక్కడ ఎవరు అమ్ముతున్నాడు అనేది కచ్చితంగా తెలియదు. Subject ఎవరో తెలియనప్పుడు,subject అవసరం లేనప్పుడు,
Passive voice లోనే మాట్లాడాలి.

 ఇక్కడ జాబ్ వర్క్ చేయబడును
Job work is done here.

 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము.
  Independent day is celebrated on August 15th.

 గాంధీ జయంతిని అక్టోబర్ 2 న జరుపుకుంటాము.
 Gandhi Jayanti is celebrated on October 2nd.

 ఈ shop ని తొమ్మిది గంటలకి open చేస్తుంటారు.
 This shop is opened at 9 o'clock.

Simple past tense: was, were
 ఈ షాపుని 9 గంటలకి ఓపెన్ చేశారు.
 The shop was opened at 9 o clock

 నిన్న ఆ బ్యాంకు ని దోచేశారు.
 The bank was Robbed yesterday.

 నిన్న ఆ సినిమా రిలీజ్ అయింది.
 That movie was released yesterday.

Simple future tense :  will be

 ఆ షాపుని రేపు 9 గంటలకి ఓపెన్ చేస్తారు.
 That shop will be opened at 9 o'clock tomorrow.

 రేపు 9:30 కి ఆ షాప్ ని ఓపెన్ చేస్తాడు.
 That shop will be opened at 9:30 a.m. tomorrow.

 ఈ పార్సెల్ మీకు రేపు డెలివరీ అవుతుంది.
 This parcel will be delivered tomorrow.

Present continuous tense: am, is, are, being
 రూమ్ ని క్లీనింగ్ చేస్తున్నారు.
 The room is being cleaned.

 షాప్ ని ఓపెన్ చేస్తున్నారు.
 The shop is being opened.

ఈరోజు దీపావళిని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
 Diwali is being celebrated today happily.

Past continuous tense:
Singular అయితే "was being"
Plural అయితే     "were being"
                                                  (Active voice)
 నిన్న ఈ టైం కి నేను సినిమా చూస్తున్నాను.
 I was seeing a movie by this time yesterday.
                                               (Passive voice)
 A movie was being seen by this time yesterday by me.

 అతను నిన్న ఈ టైం కి క్రికెట్ ఆడుతూ ఉన్నాడు.
 He was playing cricket by this time yesterday.

 cricket was being played by this time yesterday by him.

Present perfect tense:
Singular   : has been  he, she, it
Plural       : have been  I, we, they, you.

 నేను ఆ పనిని పూర్తి చేశాను.
 I have finished the work   

 The work have been finished by me

 ఆ ఇంటిని ఇప్పటికీ నాలుగైదు సార్లు దోచుకున్నారు.
 That house has been robbed 4 or 5 Times 

He has been transfered
 అతనిని ట్రాన్స్ఫర్ చేశారు.

నేను మోసపోయాను.
 I have been cheated.

Past perfect tense: had been
 నువ్వు రాకముందే నా పని నేను పూర్తి చేసేశాను.
 I had completed my work before you came.

 My work had been completed before you came.

 నువ్వు రాకముందే నేను టీ తాగేశాను.
 I had drunk tea before you came.

 Tea had been drunk by me before you came.

Future perfect tense: will have been
 రేపు నేను ఈ టైం కి పరీక్ష రాసేసి ఉంటాను.
 I will have written my examination by this time tomorrow.

My Examination will have been written  by this time tomorrow by me

 వచ్చే నెల నాటికి మీరు ఇంగ్లీషు నేర్చుకొని ఉంటారు.
 You will have learnt English by next month

 English will have been learnt by next month by you

వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏



 

               

Post a Comment

If you have any doubts, please let me know