ఈ tense లో " will have " అనే helping verb ని వాడాలి. Verb 3 ని వాడాలి
భవిష్యత్తులో ఒక సమయానికి ఒక పని పూర్తయిపోతుంది,లేదా పూర్తయిపోయి ఉంటుంది
అని తెలియచేయడానికి future perfect tense ను ఉపయోగిస్తాము.
ఇందులో simple present tense ని కూడా use చేయాలి.
భవిష్యత్తు కాలంలో రెండు Actions జరుగుచున్నపుడు ఆ రెండింటిలో ఏ Action ముందుగా జరగబోతుందో ఆ action ను Future Perfect Tense లో చెప్పాలి. తరువాత జరుగబోయే Simple Present Tense లో చెప్పాలి.
ఈ ఉత్తరం నీకు చేరేసరికి నేను చనిపోయి ఉంటాను.
I will have died by the time (before) this letter reaches you.
నీవు వెళ్లేసరికి వాడు వెళ్లిపోతాడు.
He will have left by the time (before) you go.
నీవు వచ్చేసరికి నేను నా పని పూర్తి చేసేసి ఉంటాను.
I will have completed my work by the time (before) you come.
రేపు ఈ టైమ్కి నేను పరీక్ష వ్రాసేసి ఉంటాను.
I will have written my examination by this time tomorrow.
రేపు ఈ టై నీవు ఈ పని చేసేసి ఉంటావు.
You will have done (completed) this work by this time tomorrow.
రేపు ఈ టైమికి నీవు బయలుదేరిపోయి ఉంటావు.
You will have started by this time tomorrow.
అప్పటికి ఆమెకు పెళ్లి అయిపోయి ఉంటుంది.
She will have got married by that time.
వచ్చే సంవత్సరం ఈ టైమ్కి నీవు ఎంతో మారిపోయి ఉంటావు.
You will have changed a lot by this time next year.
వచ్చే నెలకి నేను నా శిక్షణ పూర్తి చేసేసి ఉంటాను..
I will have finished my training by next month.
వచ్చే సంవత్సరం నాటికి మీరు ఇంగ్లిష్ నేర్చేసుకొని ఉంటారు.
You will have learnt English by next year.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know