కొన్ని పనులు కొంతకాలం క్రితం గాని,కొంత సమయం క్రితం గాని మొదలుపెట్టబడి ఇప్పటికీ ఇంకా జరుగుతూ ఉంటాయి.అలాంటి పనులను present perfect continuous tense లో చెప్పాలి.
I
We
You Have been
They
He
She Has been
It
ఈ tense లో "Have been "లేదా "has been " లను ఉపయోగించి, main verb కు "ing "form ను చేర్చాలి.
Examples : positive
She has been watching TV since in the morning
ఆమె మార్నింగ్ నుంచి టీవీ చూస్తుంది.
అతను రెండు గంటల నుండి క్రికెట్ ఆడుతున్నాడు.
He has been playing cricket for 2 hours.
గమనించగలరు :
Since:
Point of time
ఖచ్చితమైన సమయాన్ని తెలియజేసినప్పుడు since ని ఉపయోగిస్తాము.
Since:1999,1920
ఉదయం నుంచి,ఈ విధంగా ఖచ్చితమైన సమయాన్ని తెలియజేసినప్పుడు since ని ఉపయోగిస్తాం.
For
Period of time
గత 4,5 గంటలుగా,3 రోజులుగా, గత 5 సంవత్సరాలుగా, గత 20 నెలలుగా,
(For the last five days.) ఈ విధంగా ఉన్నప్పుడు మనం" for" ని use చేస్తాం.
రెండు రోజుల నుంచి వర్షం పడుతుంది.
It has been raining for 2 days.
మా అమ్మ నన్ను రెండు గంటల నుంచి తిడుతుంది.
My mother has been scolding me for 2 hours.
నిన్నటి నుండి నేను ఈ నోట్స్ వ్రాస్తూనే ఉన్నాను.
I have been writing this notes since yesterday.
వాళ్లు ఇప్పటికీ చాలా సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తూనే ఉన్నారు.
They have been doing this business for many years now.
ఇప్పటికీ రెండు గంటల నుండి మేము బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము.
We have been waiting for the bus for 2 hours now.
జనవరి 2000 సంవత్సరం నుండి మేము ఇక్కడ ఉంటున్నాము.
We have been living here since January 2000.
8 గంటల నుండి ఆమె నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నది.
She has been waiting for you since 8 o'clock.
ఆమె గంట నుండి నిద్రపోతూనే ఉన్నది.
She has been sleeping for an hour now.
Negatives :
Negatives కి "not" join చేస్తే సరిపోతుంది.
నేను ఉదయం నుంచి టీవీ చూడడం లేదు.
I have not been watching a TV since in the morning.
నిన్నటి నుండి నేను ఈ నోట్స్ రాయడం లేదు.
I have not been waiting this notes since yesterday.
వాళ్ళిద్దరూ ఎక్కడికి రోజు రావడం లేదు
They both have not been coming here daily.
అతను రెండు గంటల నుండి పరీక్ష రాయడం లేదు.
He has not been writing exam for 2 hours.
నేను కాలేజీలో పని చేయడం లేదు.
I have not been working at college.
Questions :
అతను రెండు గంటల నుండి పరీక్ష వ్రాస్తూ ఉన్నాడు
He has been waiting exam for 2 hours.
అతను రెండు గంటల నుండి పరీక్ష వ్రాస్తూ ఉన్నాడా?
Has he been writing exam for 2 hours?
అవును అతను రెండు గంటల నుండి పరీక్ష రాస్తున్నాడు.
Yes,he has been writing exam for 2 hours
లేదు అతను రెండు గంటలుగా పరీక్ష రాయడం లేదు.
No he has not been writing exam for 2 hours.
(Howlong అనగా ఎంతసేపటినుండి, ఎప్పటినుండి )
అతను ఎంతసేపటినుండి పరీక్ష రాస్తూ ఉన్నాడు.
How long has he been waiting exam?
She has been searching for the job?
ఆమె ఉద్యోగం కొరకు వెతుకుతూ ఉంది.
Has she been searching for the job?
ఆమె ఉద్యోగం కొరకు వెతుకుతూ ఉందా?
Yes, she has been searching for the job? అవును, ఆమె ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటుంది.
No, she has n't been searching for the job? లేదు, ఆమె ఉద్యోగం కొరకు వెతకడం లేదు.
Why has she been searching for the job? ఆమె ఎందుకు ఉద్యోగం కొరకు వెతుకుతూ ఉంది?
Positive, negative మరియు questions కి తేడాలను గమనించి వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know