simple future tense, learn English through Telugu

simple future tense, learn English through Telugu
 Simple future tense లో shall/will అనే helping verb ని use చేస్తాము.

 జరగబోయే పనులను విషయాలను simple future tense లో చెబుతాము.

Positive
Examples :

 వాళ్లు రేపు మా ఇంటికి వస్తారు.
 They will come to my house tomorrow.

 ఆ విషయం గురించి నేను తర్వాత ఆలోచిస్తాను.
 I will think about that matter later.

 నీకోసం ఇది నేను చేస్తాను.
 I will do it for you.

 నేను నా మాట నిలబెట్టుకుంటాను.
 I will keep my word.

 నేను నిన్ను తర్వాత కలుస్తాను
 I will meet you later.

 నేను రేపు అక్కడికి వెళ్తాను
I will go there tomorrow.

 నేను మీ ఇంటికి వస్తాను
 I will come to your house.

 ఇక్కడికి రమ్మని వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తాను
 I will request them to come here

 నేను నీతో నరకానికైనా వస్తాను
 I will come with you even to hell

 మీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను.
 I will answer to your question.

Negative :
Negative లో "not"add చేస్తే సరిపోతుంది.

 నేను మీ ఇంటికి రాను
 I will not come to your house.

 నేను అక్కడికి వెళ్ళను
 I will not go there

 నేను నిన్ను మళ్ళీ కలవను
 I will not meet you again

 నేను ఎప్పుడూ నిన్ను నమ్మను
 I will never believe you

 నేను నీ దగ్గరికి రాను
 I will not come to you

 రెండు రోజులు కంటే ఎక్కువగా నేను అక్కడ ఉండను.
 I will not stay there more than 2 days.

 ఇకమీదట నేను నీతో మాట్లాడను
 I will not talk to you here after

నేను రేపు ఆఫీసుకి వెళ్ళను.
I Will not Will not go to office tomorrow

 ఆమె నా దగ్గర ఏ విషయాన్ని దాచదు.
 She will not hide anything from me

 నేను నా సమస్యల్ని ఎవరితోనో చెప్పను
 I will not tell my problems to anybody.

Questions :

 నేను మీ ఇంటికి వస్తాను                 positive
I will come to your house

 నేను మీ ఇంటికి  రాను                   negative
 I will not come to your house

 నువ్వు మా ఇంటికి వస్తావా?           Question 
 Will you come to my house?

 నువ్వు మా ఇంటికి రావా?      
 Will you not come to my house?
                  (Or)
 Won't you come to my house?

Examples :
నీవు మళ్లీ ఇక్కడకి ఎప్పుడు వస్తావు? 
When will you come here again?

నీవు రేపు ఎక్కడికి వెళ్తావు? 
Where will you go tomorrow?

నీవు రేపు అక్కడకి వెళ్లవా? 
Will you not go there tomorrow?

నీవు రేపు ఏమి చేస్తావు?
What will you do tomorrow?

 నీవు ఈ పని ఎలా చేస్తావు?
 How will you do this work?

 నీవు ఈ పని ఎప్పుడు మొదలుపెడతావు?
When will you start this work?

నీవు వాళ్లను ఎప్పుడు కలుస్తావు?
 When will you meet them?

నీవు వాళ్లను మళ్లీ కలుస్తావా? 
Will you meet them again?

నీవు వాళ్లను మళ్లీ కలువవా?
Won't you meet them again?

ఇండియా పాకిస్తాన్ మీద గెలుస్తుందా?
 Will India win over Pakistan?

 నీవు ఏమవుతావు? 
What will you become?

నీవు నన్ను ఎప్పుడు అర్ధం చేసుకుంటావు?
 When will you understand me?

వాళ్లు నిజం ఎప్పుడు తెలుసుకుంటారు?
When will they know the fact?

వాళ్లు నిజం తెలుసుకోరా? 
Will they not know the fact ?

నీవు ఆ సినిమా చూస్తావా? 
Will you see that movie?

 నీవు ఆ సినిమా ఎప్పుడు చూస్తావు? 
When will you see that movie?

నీవు రేపు ఇక్కడికి వస్తావా?
Will you come here tomorrow?

Positive, negative మరియు questions కి తేడాలను గమనించి వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏🙏🙏🙏




Post a Comment

If you have any doubts, please let me know