చార్లెస్ డార్విన్ (అమెరికా)
(1809-1882)
చార్లెస్ సంపన్న కుటుంబంలో జన్మించాడు. తాత, తండ్రి ప్రసిద్ధ వైద్యులు, కానీ ఇతనికి మాత్రం చదువు సరిగ్గా ఒంటబట్టలేదు. చిన్నతనం నుంచి ప్రకృతిని పరిశీలించటం నేర్చుకున్నాడు.
భూమి ఉన్నది. భూమి మీద రకరకాల జీవరాశులు ఉన్నాయి. ఇవి భూమిమీద ఎలా అవతరించాయి? ఎలా పరిణామం చెందాయి? అన్ని ప్రశ్నలు పూర్వకాలం నుంచి మానవులను వేధిస్తున్నాయి. కొన్ని మత గ్రంధాలు ఈ సృష్టిని ఆ దేవ దేవుడు సృష్టించాడని అన్నాయి. ఈ భావాన్ని ప్రజలు నమ్మారు.
అయితే ఈ భావాన్నే పట్టుకువేళ్లాడకుండా
కొందరు మేధావులు జీవుల పుట్టుక, పరిణామం గురించి ఆలోచించారు. ఎన్నో దృష్ట్యాంతాలు చూసి కొన్ని సిద్ధాంతాలు చేశారు. అటువంటి వారిలో పరిణామ సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా ప్రతిపాదించిన విజ్ఞాని చార్లెస్ డార్విన్ మహాశయుడు ఒకరు.
వైద్య విద్య నేర్పాలని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాల
యంలో చేర్పించారు. అక్కడ రెండేళ్లు మాత్రమే గడిపాడు.
క్రైస్తవ మత సాహిత్యం చదవటానికి ఎడిన్ బర్గ్
విశ్వ విద్యాలయం వదిలి కేంబ్రిడ్జి వెళ్ళాడు. అక్కడ వృక్ష,జీవ శాస్త్ర అధ్యాపకులతో పరిచయం కలిగించుకుని వాటిపైన దృష్టిని మళ్లించి అసలు చదువు పక్కన పెట్టాడు.తరచూ గోష్టుల్లో పాల్గొనటం, కనపడిన కీటకాలను సేకరించటం ఎంతో యిష్టంగా చేసేవాడు.
ఎక్కువగా జీవుల ఉత్పత్తిని గురించి జరిగే చర్చల్లో పాల్గొనేవాడు. 1831లో బియగిల్ అనే ఓడ భౌగోళిక, వైజ్ఞానిక పరిశోధనల కోసం ప్రపంచ యాత్రకు బయల్దేరింది. చార్లెస్కి దానిలో ప్రకృతి శాస్త్ర పరిశోధకుడిగా అవకాశం లభించింది. ఆ యాత్ర ఐదు సంవత్సరాలు సాగింది. ఆ యాత్రలో ఓడ ఆగిన చోటల్లా ఎన్నో రకాల మొక్కలు రాళ్ళు. ... కీటకాలు జంతువుల శిలాజాలు (ఫాసిల్స్) సేకరించాడు. ఎన్నో వింతలు... విడ్డూరాలు చూశాడు.దక్షిణ అమెరికాకు పడమరగా నున్న గాలాపడోస్ దీవుల్లో పురాతన లక్షణాలు ఉన్న జీవులు ఎన్నో కన్పించాయి.
యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత 20 సం॥ల పాటు శ్రమించి సిద్ధాంతాలు చేయటానికి సాక్ష్యాలు సేకరించాడు. 1889లో మిత్రుల ఒత్తిడితో ఆరిజన్ ఆఫ్ స్పీషిస్ బైనాచురల్ సెలక్షన్ (ప్రకృతివరణంలో జీవ జాతుల ఉత్పత్తి) అన్న గ్రంధం ప్రచురించాడు.
ఆ గ్రంధం విడుదలైన మొదటి రోజే అన్ని కాపీలు విశేషంగా అమ్ముడుపోయాయి.ఆ తర్వాత ఆ గ్రంధం ఎన్నో ప్రచురణలు పొందింది. ప్రకృతి ఎన్నిక వలన జాతుల ఉత్పత్తి జరుగుతుందన్నారు.
నరునికి, వానరునికి పూర్వీకులు ఒక్కరే. పరిసరాలకు అనుగుణంగా జంతు, వృక్షాలలో
మార్పు కలుగుతుంది. ఇలా కొన్ని సిద్ధాంతాలతో పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి తన
పేరునిలుపుకున్నాడు. చార్లెస్ డార్విన్ అప్పటికే ఎందరో శాస్త్రజ్ఞులకు మార్గదర్శకుడిగా
నిలిచాడు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know