అమర్త్యసేన్ (ఇండియా)
ఏదైనా సంక్షోభానికి కారణాలను విశ్లేషించేటప్పుడు, పరిష్కారాలను సూచించే టప్పుడు
సమాజంలోని అనేక వ్యవస్థల మధ్య సంబంధాన్ని విస్మరించటం తరచూ చూస్తుంటాం.
ఎక్కడైనా దుర్భిక్షం, కరువు కాటకాలు ఏర్పడితే అక్కడ ఆహార ధాన్యాలు లేకపోవటమే దానికి కారణమని భావించే పరిస్థితి నిన్న మొన్నటి వరకు ఉంది.
కానీ అమర్త్యసేన్ పరిశోధనలు ఈ భావనను
పటా పంచలు చేశాయి. ప్రాధమిక విద్య, ఆరోగ్యం ఏ
దేశ అభివృద్ధిలోనైనా కీలకపాత్ర పోషిస్తాయని అర్ధ
శాస్త్రానికి నూతన దిశా నిర్ధేశం చేశారు. నీతి శాస్త్రం,
తత్వ శాస్త్రాల వెలుగులో అభివృద్ధి, అర్ధశాస్త్రానికి కొత్తసొగసులు అడ్డారు.
మనదేశంలో ఆడపిల్లలకు చదువు చెప్పించడ
మంటే పక్కింటి పెరట్లో చెట్టుకి నీరు పోసినట్టు భావిస్తారని భారతదేశంలో ప్రాధమిక విద్యా రంగం పరిస్థితిని అమర్త్యసేన్ విశ్లేషించారు. సంక్షేమ అర్ధశాస్త్రంలో కృషికి గుర్తింపుగా 1998లో ప్రతిష్ఠాత్మక నోబుల్ బహుమతి ఆయన్ని వరించింది.
ఏదైనా ఒక అంశంపై సర్వత్రా అంగీకారం ఉన్నపుడు నిర్ణయం తీసుకోవటం తేలికే. భేదాభిప్రాయాలు ఉన్నపుడే సమస్య తలెత్తుతుంది. వ్యక్తి ప్రాధమ్యాలను బట్టి సామాజిక ప్రాధమ్యాలను నిర్ణయించాలి. వీటి మధ్య వైరుధ్యం ఉండకూడదు. పేదరికం అసమానతలు,సామాజిక సంక్షేమం, అభివృద్ధిని అంచనా వేసేటపుడు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది.
వ్యక్తుల మధ్య ఎంతో కొంత సమానత్వం సాధించటమే అన్ని నైతిక నియమాల
సారాంశం. కానీ అవకాశాలను అందిపుచ్చుకోవటంలో వ్యక్తుల సమర్ధతలో అసమానతలు సుస్పష్టం. అందువల్ల సంక్షేమాన్ని అంచనా వేసేటప్పుడు వస్తువులను గాక వ్యక్తుల ఆదాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ఆదాయాలే అవకాశాలను, సామర్థ్యాలను కల్పిస్తాయి. ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ఆరోగ్యం, విద్యను ప్రధానమైనవిగా పరిగణించాలి. వ్యక్తుల సామర్థ్యాలను,అవకాశాలను అనేక సామాజిక, ఆర్థిక అంశాలు ప్రభావితం చేస్తాయి.
క్షామాన్ని అంచనా వేసేటప్పుడు వీటిని దృష్టిలో వుంచుకోవాలి. ఉదాహరణకు 1974లో బంగ్లాదేశ్లో దేశవ్యాప్తంగా వరదల వల్ల ఎలాంటి పంటలు పండించలేదు.
దీంతో వ్యవసాయ రంగంలో పని చేసే వారి ఆదాయాలు దారుణంగా పడిపోయాయి.
అక్కడి ఆకలి చావులకు ఇదే కారణం.
దృక్పధాల్లో వైరుధ్యం చరిత్రకే పరిమితం కాదు. వాస్తవానికి ఏ శాస్త్ర పురోగతిలోనైనా వైరుధ్యం అత్యంత కీలకమైనది. ఎందుకంటే మన అభిప్రాయాలు, దృక్పధాలు,పరిశీలనలు అన్నీ కూడా వారి వారి స్థితి చేత ప్రభావితమవుతాయి. వాస్తవాలను అర్థం చేసుకుని, విశ్లేషించడంలో దీని పాత్ర చాలా వుంటుంది.
చరిత్రపై ఆసక్తి చూపటానికి కారణం సమాజంలో దాని ప్రభావాన్ని గుర్తించడమే,వాస్తవానికి ఒక వ్యక్తికి తాను పుట్టకముందే ఎలాంటి వ్యక్తిగత చరిత్ర వుండదు. ఎపుడో జరిగిన సంఘటనలతో అతనికి సంబంధం వుండదు. అయినా వాటి పై ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. మన పాత తరాలను ఆ సంఘనలతో మమేకం చేసుకుని ఒక గుర్తింపును
కోరుకుంటాం. ఇదే మన అభిప్రాయాలకు, దృక్పధానికి పునాది.
స్వాతంత్య్రానంతరం భారతదేశం కొన్ని రంగాల్లో చాలా ప్రగతి సాధించింది. ముఖ్యంగా
క్షామాలను అరికట్టడంలో చాలా దేశాలకంటే ముందుంది. కానీ అసమానతలు తగ్గించటానికి
చేయాల్సింది చాలా వుంది. అభివృద్ధికి ప్రాణావసరాలైన ప్రాధమిక ఆరోగ్యం, అక్షరాస్యత
సాధనలో ఎన్నో చిన్న దేశాల కంటే వెనుకబడి ఉంది.
1943లో బెంగాల్లో సంభవించిన క్షామంపై అమర్త్యసేన్ అధ్యయనం సంక్షేమ అర్ధశాస్త్రానికి కొత్త రూపు నిచ్చింది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన ఫెమెన్ ఎంక్వైరీ
కమీషన్ సకాలంలో వర్షాలు లేకపోవటం, బర్మా నుంచి ధాన్యం దిగుమతి కాకపోవటాన్ని,బెంగాల్ క్షామానికి ప్రధాన కారణాలు గా చూపించింది. వీటికి పూర్తిగా విరుద్ధమైన వాస్తవాలను వెలికితీసిన అమర్త్యసేన్ అధ్యయనం ఆసక్తిని రేకెత్తించింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know