conjunctions, learn English through Telugu

conjunctions, learn English through Telugu

Thus

Thus we had to solve the problem 
కావున / ఆ విధంగా మేము ఆ సమస్య పరిష్కరించవలసి వచ్చింది.

 Thus the police man arrested him. 
ఆవిధంగా ఆ Police man అతనిని అరెస్ట్ చేశాడు.
 
For the sake of

They hate each other, but for the sake of their children they are living together 
వారు ఒకరినొకరు ద్వేషించుకుంటారు. కానీ వారి పిల్లల కోసం వాళ్ళు కలిసి ఉంటున్నారు.

For your sake, I came here 
మీ గూర్చి నేను ఇక్కడికి వచ్చాను.

I'm aloath to do this project, but for my friend sake I will do
నాకు ఆపని చేయడం ఇష్టంలేదు. కానీ మా స్నేహితుని కోసం చేస్తాను.

 Then

I had gone to Madanapalle last year then I met him.
 నేను మదనపల్లికి వెళ్లినపుడు అతన్ని కలిశాను.

Go straight and take left then you can see a big building.
నేరుగా వెళ్ళి ఎడమచేతివైపు తిరిగితే, అప్పుడు పెద్ద బిల్డింగు కనిపిస్తుంది.

First you work hard, then you can secure good marks.
మొదట కష్టపడి పనిచేయు, అప్పుడు నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.

Once

Once I used to go for morning walk every day.
ఒకప్పుడు నేను తెల్లవారుజాముననే వాకింగే వెళ్లేవాడిని.

 Once up on time India was ruled by white people.
ఒకానొకప్పుడు భారతదేశం తెల్లవాళ్ళచే పరిపాలించబడింది.

Once you come and notice here.
ఒకసారి మీరు వచ్చి  తెలియజేయండి.


"Although" 
 అతను బాగా చదివినప్పటికీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు.
Although he studied well he failed in the examinations.

నేను వేగంగా బయలుదేరినప్పటికీ నాకు రైలు దొరకలేదు. 
I could not catch the train although I started early.

అతను ఆర్థికంగా పేదవాడైనప్పటికీ సంస్కారంలో సంపన్నుడు. 
Although he is poor in wealth he is rich in culture.

 నేను ఆమెకు చాలా ఉత్తరాలు వ్రాసినప్పటికీ ఆమె నాకు ఒక ఉత్తరం కూడా వ్రాయలేదు. 
She didn't write even a single letter to me although I wrote many letters to her.

 నేను అతనికి చాలాసార్లు చెప్పినప్పటికీ అతను నా మాట వినలేదు. 
He didn't listen to me although I advised him a number of times.

 అతను బాగా చదవకపోయినప్పటికీ అతను పరీక్షలు పాస్ కాగలిగాడు. 
He could pass the examinations although he has not studied well.

 వాళ్లు విశాఖపట్నం వచ్చినప్పటికీ నేను వాళ్లను కలవలేకపోయాను. 
I could not meet them although they came to Visakhapatnam.

either or

 నీవు ఇది గాని అది గాని తీసుకోవచ్చు. 
You can take either this or that. 

నేను నిన్ను జగదాంబ జంక్షన్ వద్ద గాని, సరస్వతి పార్కు దగ్గర గాని కలుస్తాను. 
I will meet you either at Jagadamba Junction or at Saraswathi Park. 

నీవు గాని నేను గాని అక్కడకు వెళ్లాలి. 
Either you or I should go there.

మీరు ఈ దారి గుండా గాని ఆ దారి గుండా గాని వెళ్లవచ్చు. 
You may go either this way or that way. 

నీవు ఇక్కడికైనా రావచ్చు లేదా అక్కడైనా ఉండిపోవచ్చు. 
You can either come here or stay there.

మన మేనేజరు ఇక్కడకి కారులో గాని స్కూటర్ మీద గాని వస్తారు. 
Our Manager will come here either by a car or by a Scooter.

నేను రేపు గాని ఎల్లుండి గాని అక్కడకు వస్తాను. 
I will come there either tomorrow or the day after tomorrow.

Neither nor
నేను కాంగ్రెస్కీ ఓటు వేయను బి.జె.పి.కీ ఓటు వేయను. 
I will vote neither to Congress nor to B.J.P.

అతడు నాకు నిజమూ చెప్పలేదు అబద్ధమూ చెప్పలేదు.
He told me nither a truth nor a lie. 

ఎన్నికల్లో టి.డి.పి.కి గానీ కాంగ్రెస్కు గానీ మెజార్టీ రాదు. 
Neither the TDP nor the Congress will get the majority in the elections.

As soon as (immediately after / soon after) 
అక్కడికి వచ్చిన వెంటనే నేను నిన్ను కలుస్తాను. 
I will meet you as soon as

పదవ తరగతి పాస్ అయిన వెంటనే అతడు ఆర్మీలో చేరాడు. 
He joined in Army as soon as he passed tenth class.

ఈ ఉత్తరం అందిన వెంటనే నీవు ఇక్కడకు రావాలి. 
You have to come here as soon as you received this letter. 

వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏


Post a Comment

If you have any doubts, please let me know