సి.వి.రామన్ (ఇండియా)
1888 నవంబర్ 7న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించిన రామన్ బాల్యం
సాధారణ బాలల మాదిరిగానే గడిచింది.
చిన్నతనంలో తండ్రి వీణ, వయొలిన్ వాయిస్తుంటే శ్రద్ధగా వినేవాడు. జడపదార్థాలైన వాయిద్యాల నుంచి మనసులను రంజింపచేసే శ్రావ్యమైన సంగీతం ఎలా వస్తుందో తెలుసుకోవాలన్న కుతూహలం ఆయనలో కనిపించింది.
| సంగీత వాయిద్యాల ధ్వని ఆయన మదిలో ఎప్పుడూ ప్రతి ధ్వనిస్తుండేది.
చివరికి 1918లో ఆయన వాయిద్యాల తీగలపై కలిగే సంక్లిష్ట కంపనాలను బట్టి వాటిలో నుంచి శ్రావ్యమైన ధ్వని వెలువడుతుందని
తెలియచెప్పాడు. గమనించిన ప్రతి అంశాన్ని కూలంకుషంగా పరిశీలించి, దానికి సంబంధించిన
వివరాలన్నీ తెలుసుకునేదాకా వదిలిపెట్టేవాడు కాదు.
మెట్రిక్యులేషన్ తర్వాత ఎఫ్.ఎ. పరీక్షలో ఉత్తీర్ణుడై
ఉన్నత విద్య కోసం మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు.సాధారణంగా సంపన్నులకే ప్రవేశం ఉండే ఆ కాలేజీలో రామన్ ప్రతిభతో స్థానం సంపాదించాడు. 16వ సంవత్సరంలో బి.ఎ., 18వ సంవత్సరంలో ఎం.ఎ. మద్రాసు రాష్ట్రం మొత్తానికి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణుడయ్యారు.
బి.ఎ.లో ఉండగానే రామన్కు భౌతిక శాస్త్రంపై ఆసక్తి పెరిగింది. భౌతిక శాస్త్రంలో తనకు ఎదురైన సమస్యలను లోతుగా పరిశీలించి, అవసరమైన సమాచారాన్ని రాసి పెట్టుకునేవాడు.
అలా ఆయన దగ్గర విజ్ఞాన భాండాగారం ఏర్పడింది. ఎం.ఎ. చదువుతున్న రోజుల్లో బ్రిటన్ నుంచి వెలువడే 'ఫిలాసాఫికల్ మేగజైన్', 'నేచర్ సైన్స్ మేగజైన్ల'కు వ్యాసాలు రాసి పంపాడు.
వాటిని చదివిన అప్పటి అగ్రశ్రేణి శాస్త్రవేత్తలకు రామనన్ను చూడాలన్న కోరిక కలిగింది.
భవిష్యత్తులో ఈ యువ శాస్త్రవేత్త అద్భుతాలు సాధించగలడని వారు ఆనాడే అనుకున్నారు.
అప్పట్లో ప్రతిభావంతులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐ.ఎ.ఎస్) పరీక్ష రాసేవారు. అయితే, ఆ పరీక్ష రాయాలంటే లండన్ వెళ్లవలసి వచ్చేది. అక్కడి దాకా వెళ్లే స్థోమత లేకపోవడంతో భారత్లో నిర్వహించే ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీసు (IFS.)పరీక్ష రాశాడు.
అందులో ప్రథముడిగా నిలిచి కలకత్తాలో అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్గా ఉన్నతోద్యోగంలో చేరాడు. అప్పటికి రామన్ వయసు 19 సంవత్సరాలే.
బానిస దేశంలో శాస్త్ర పరిశోధనలను ప్రోత్సాహించకూడదన్న విధానపరమైన
నిర్ణయంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భారత్లో పరిశోధనా కేంద్రాలు నెలకొల్పలేదు.అయితే కలకత్తాకు చెందిన సంపన్నుడైన ఒక డాక్టర్ తన సొంత పెట్టుబడితో, భారతీయ శాస్త్రవేత్తలకు ప్రపంచమంతటా గుర్తింపు తీసుకురావాలన్న తపనతో 'అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్' అనే సంస్థను నెలకొల్పాడు.
రామను దీని గురించి తెలిసింది. ఒకసారి కలకత్తాలో ట్రామ్ కారులో వెళ్తుండగా ఆ సంస్థ కార్యాలయం కనిపించి వెంటనే ట్రామ్ దిగి అందులోకి వెళ్లాడు. తీరిక సమయాల్లో పరిశోధనలు చేసేందుకు అవకాశం ఇవ్వమని అడిగాడు.
నిర్వాహకులు అంగీరించడంతో ఒకవైపు ప్రభుత్వోద్యోగం చేస్తూనే మిగతా సమయంలో
పరిశోధనలు చేసేందుకు అందులో చేరాడు. ప్రయోగశాలను ఆనుకొని ఉండే ఇంట్లో అద్దెకు
దిగాడు.
రెండింటికీ మధ్య తలుపు కూడా ఉండడంతో రాత్రంతా ప్రయోగశాలలోనే గడుపుతూ అంతు చిక్కని భౌతికశాస్త్ర ప్రశ్నలకు పరిష్కారం కనుగొనేవాడు. పరిశోధనలు ఇలా కొనసాగుతున్న తరుణంలో 1909లో అప్పటి ఆంగ్లేయుల నేతృత్వంలోని ప్రభుత్వం ఆయనను బర్మా రాజధాని రంగూన్ కు బదిలీ చేసింది.
ఇష్టం లేకపోయినా... ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించేందుకు బర్మా వెళ్లాడు. రామన్ కలకత్తా విడిచి వెళ్లడం అక్కడి మేధావులను కలచి వేసింది. కలకత్తా యూనివర్సిటీ వైస్ 'ఛాన్సలర్ ఆశుతోష్ ముఖర్జీ ఆయనను అరుదుగా లభించే రత్నం వంటి వాడని కొనియాడారు.
ముఖర్జీ విజ్ఞాపన మేరకు 1917లో రామన్ ప్రభుత్వోద్యోగాన్ని వదులుకుని కలకత్తా
విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా చేరాడు. ఆయన వద్ద చదువుకున్న హోమీ బాబా పదవీ
విక్రమ్ సారాభాయ్ు ఆ తర్వాత అణు, అంతరిక్ష శాస్త్రాలలో అగ్రగణ్యులుగా నిలిచారు.
ఆశుతోష్ ముఖర్జీ అధ్యక్షతన ఏర్పడిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో భౌతికశాస్త్ర విభాగానికి రామన్ సారథ్యం వహించారు.
1921లో ఇంగ్లండ్లో జరిగిన ఒక శాస్త్రవేత్తల సదస్సుకు రావలసిందిగా రామనక్కు ఆహ్వానం అందింది. అప్పట్లో విమాన సౌకర్యం ఉండేది కాదు. దాంతో నౌకలో బయల్దేరాడు.రోజుల తరబడి సాగిన ప్రయాణంలో మధ్యధరా సముద్రజలాలు ఆయన్ను ఆకర్షించాయి. నీరు నీలం రంగులో ఎందుకుంటుందో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది.స్వదేశం తిరిగి వచ్చిన తర్వాత నెలరోజులు రేయింబవళ్లూ శ్రమించి రహస్యాన్ని ఛేదించాడు.హిమనీనదాలు, మంచుపర్వతాలు కూడా నీలం రంగులో ఉండటాన్ని బట్టి కాంతి కిరణాలవల్లే ఈ చర్య జరుగుతోందని గ్రహించి ఆ దిశగా ప్రయోగాలు చేశాడు.
సూర్యకాంతి నీటి పరమాణువులపై ప్రసరించి వెంటనే పరిక్షిప్తం చెంది, వివిధ దిశల్లో పరావర్తనం చెందుతుంది. అందువల్ల నీరు నీలం రంగులో కనిపిస్తుందని తెలుసుకున్నాడు. ఏకవర్ణ కాంతి పారదర్శక పదార్థం గుండా పయనించినప్పుడు ఆ కాంతి పుంజం పరిక్షిప్తం చెందుతుంది. పతన కిరణం ఏక వర్ణంలో ఉన్నప్పటికీ దాని నుంచి బహువర్ణ కిరణాలు వెలువడుతాయని రామన్ నిరూపించాడు.
1928 ఫిబ్రవరి 28న రామన్ ఈ అత్యున్నత ఆవిష్కరణ చేశారు. ఆ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ప్రతీయేటా ఫిబ్రవరి 28న మనం జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాంతి 'ఫోటాన్లు' అనే అణువుల సముదాయమని రామన్ చెప్పారు.
రామన్ ఎఫెక్ట్ అంతర్జాతీయ సిద్ధాంతంగా ఆమోదం పొంది ఆయనకు నోబెల్ బహుమతిని తెచ్చి పెట్టింది. భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. నోబెల్ బహుమతిని పొందిన తొలి భారతీయుడిగా రామన్ గుర్తింపు పొందాడు.
ఐన్స్టీన్ స్వయంగా రామనన్ను అభినందించారు. 1930లో రామన్ నోబెల్ బహుమతికి
ఎంపికయ్యాడు.
స్టాకోమ్ నుంచి ఒక సదస్సులో పాల్గొనేందుకు రామన్ ఫ్రాన్స్ వెళ్లారు. అక్కడ శాస్త్రవేత్తలు అడిగిన పలు సందేహాలకు సులువైన పరిష్కారాలు చెప్పారు.
ఫ్రాన్స్కు చెందిన అత్యున్నత అధికారులు ఆ సదస్సుకు వచ్చారు. తమ దేశ పౌరసత్వం
తీసుకోవలసిందిగా అభ్యర్థించారు. దానికి ఆయన నిరాకరించాడు. నా దేశం నన్ను ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దింది. 'నా దేశం గాలి పీల్చాను, తిండి తిన్నాను. కాబట్టి నా దేశాన్ని వదలను' అని నిక్కచ్చిగా చెప్పాడు.
1933లో బెంగుళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐ.ఐ.ఎస్) డైరెక్టర్ పదవిని రామన్కు ఇవ్వాలని ప్రభుత్వం తలపెట్టింది. అప్పటిదాకా ఆ పదవిని చేపట్టే అర్హత ఆంగ్లేయులకే ఉండేది.
రామన్ కోసం బ్రిటిష్ పాలకులు మత నిబంధనలను సడలించుకున్నారు. అప్పటికే ఆ పదవిని ఆశిస్తున్నవారు ఆయనపై ఈర్ష్యాసూయలు పెంచుకొని దుష్ప్రచారం మొదలు పెట్టారు.
భౌతిక శాస్త్రం తప్ప యింకేమీ పట్టదని, మిగతా పరిశోధనలను నిర్లక్ష్యం చేస్తున్నాడని ప్రచారం ప్రారంభించారు. ఆ నోటా ఈ నోటా విషయం తెలుసుకున్న రామనుకు తృణప్రాయంగా పదవిని వదులుకున్నారు. అదే సమయంలో ఇంగ్లండ్లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుంచి రామన్క ఆహ్వానం అందింది. నేను ప్రప్రధమంగా భారతీయుడిని. ఏమైనా జరగనివ్వండి. నేను ఈ దేశాన్ని వదిలి వెళ్లను అని చెప్పారు.
1934లో బెంగుళూరులో ఆయన 'రామన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్'ను నెలకొల్పాడు. 1948లో అది రామన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్గా మారింది. ఉద్యోగ విరమణకు రెండేళ్లు ముందు దీన్ని స్థాపించాడు. రిటైర్మెంట్ ఉద్యోగానికిగానీ మనసుకు కాదని ఆయన నమ్మకం.
తన ఆస్తి మొత్తాన్ని సంస్థ పేరిట రాసి విదేశీ పరిశోధన సంస్థలకు తీసిపోని సౌకర్యాలు
కల్పించాడు. ఇనిస్టిట్యూట్ ఆవరణలో గొప్ప మ్యూజియం ఏర్పాటు చేసేందుకు ఎంతగానో
శ్రమించాడు రామన్. ప్రకృతి ఆరాధకుడైన రామన్ ఇనిస్టిట్యూట్ చుట్టూ మొక్కలు నాటి
పెంచి పెద్ద చేశారు. 1954లో భారత ప్రభుత్వం రామన్కు 'భారతరత్న' పురస్కారం ప్రకటించింది.
జీవిత చరమాంకంలో కూడా రామన్ విజ్ఞానాన్వేషణ ఆగలేదు. తాను పెంచిన చెట్లపై రంగు రంగుల పూలను చూసినప్పుడు, ఈ రంగులు ఎలా చూడగలుగుతున్నామో తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఆయనలో బయల్దేరింది. దీనిపై పరిశోధనలు చేసి 'ది ఆఫ్ విజన్' అనే పుస్తకాన్ని వెలువరించారు.
1970 నవంబర్ 21న చేతిలో పుస్తకంతో పడక మీద ఉండగానే గుండెపోటు వచ్చింది. చివరగా.... 'సరైన మానవత, సరైన ఆలోచన, సరైన పరికరాలు, సరైన ఫలితాలు...అంటూ తుది శ్వాస విడిచారు.
డబ్బును తృణప్రాయంగా వదులుకొని, దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావడానికి చేసిన
ప్రాధాన్యమిచ్చిన సర్ సి.వి.రామన్ నేటి యువతరానికి స్ఫూర్తి నివ్వాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know