అలెక్సీ కారెల్ (ఫ్రాన్స్)
(1873 1944)
వైద్య శాస్త్రమంటే చిన్నప్పటి నుండీ మక్కువను పెంచుకున్నాడు అలెక్సీ కారెల్, కాగితాన్ని తీసుకొని సన్నని సూదితోనూ, అతి సన్నని దారంతోనూ కుట్లు కనిపించకుండా కుట్లు వేయటం సాధన చేశాడు.
1900లో వైద్య విద్య పూర్తి చేసి లియాన్ విశ్వవిద్యాలయ బోధనా విభాగం లో కొన్నాళ్ళు పనిచేశాడు. 1904లో చికాగో చేరి అక్కడ ఉన్న "హల్ శరీర ధర్మ శాస్త్రవేశ ప్రయోగశాలలో చేరి ఎన్నో పరిశోధనలు చేశాడు. 1906లో న్యూయార్క్ వైద్య పరిశోధన కోసం కొత్తగా ఏర్పడిన “రాక్ఫెల్లర్ ఇన్స్టిట్యూట్”లో చేరి చాలా కాలం అక్కడే పనిచేశాడు.
ఇప్పుడు గుండెకు చేసే శస్త్ర చికిత్సలు, మూత్ర పిండాల మార్పిడి మొదలైన వాటిని వైద్యులు తేలికగా చేయగలుగుతున్నారు. గుండెకు శస్త్ర చికిత్స చేసేటప్పుడు "హార్ట్ లంగ్ మెషిన్" ను ఉపయోగిస్తున్నారు. దీని వలన శస్త్ర చికిత్స చేయవలసిన గుండె పనిచేయకపోయినా దానికి చికిత్స జరుగుతుంది.
దీనినే “ఓపెన్ హార్ట్ సర్జరీ” అంటున్నారు. రక్త నాళాలు పాడైపోయిన సమయాలలో దేశ
వాటిని శస్త్ర చికిత్స ద్వారా తీసి వేరేచోటి నుండి తీసిన నాళాలను కలిపి కుట్టి రక్త ప్రసరణను
సరిచేయగలుగుతున్నారు. దీనిని “బైపాస్ సర్జరీ” అంటున్నారు. మూత్ర పిండాల మార్పిడిని
“కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్” అంటున్నారు. వంద సంవత్సరాల క్రితం ఆయా పద్ధతుల్లో ఎన్నో
పరిశోధనలు చేసి తరువాత వైద్యులకు మార్గదర్శకంగా నిలిచిన ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త
"అలెక్సీ కారెల్".
కారెల్ వృత్తి రీత్యా శాస్త్రజ్ఞుడు. శస్త్ర చికిత్సా నిపుణుడు, జీవశాస్త్రవేత్త. పైగా సమాజ శాస్త్రవేత్త, పరిశోధనలో నైపుణ్యం ఉన్నది. నీతివంతమైన శస్త్ర చికిత్స విధానం ఉన్నది. ఇవి రెండూ అతడి కార్యాన్ని విలువైనదిగా చేశాయి.
ధమనుల చివరి భాగాలను అతికించి నేర్పుగా కుట్లు వేసే పద్ధతులను కనుగొన్నాడు.కుక్కలు, పిల్లుల మీద అతడు మొదట ప్రయోగాలు చేశాడు. రక్త వాహికలను కలిపి కుట్టటంలో అధ్యయనం చేసి కొత్త విధానాలను ప్రవేశపెట్టాడు. ఈ విధానాలు తరువాత వైద్యులకు శరీరంలోకి నిరపాయకరంగా రక్తం ఎక్కించటం లోనూ, ఒకరి నుండి తీసిన ధమనులు,సిరలు, ఇతర అవయవాలూ మరొకరికి అమర్చటంలోనూ బాగా ఉపయోగపడ్డాయి.
ఈ పరిశోధనలకు గాను 1912లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. ప్రఖ్యాత
విమాన బోధకుడు చార్లెస్ లిండ్ బర్గ్తో కలిసి శస్త్ర చికిత్స చేసేటప్పుడు మానవ అవయవాలు
చెడిపోకుండా ఉంచగలిగే పద్ధతులపై పరిశోధనలు చేశాడు. 1935లో “పెర్ఫ్యూన్ ఏంప్”
(కృత్రిమ గుండె)ను రూపొందించాడు. ఇది తరువాత వారికి ఎంతో ఉపయోగపడింది.
ఇలా అతడు చేసిన పరిశోధనలు శస్త్ర చికిత్సారంగంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know