ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురుంచి

ఆల్బర్ట్ ఐన్స్టీన్
  

ఆల్బర్టు ఐన్స్టీన్ (జర్మనీ)
(1879-1955)
మనం ఉన్న భూమి ఈ విశ్వంలో ఒక చిన్న నలుసులాంటి భాగం. విశ్వంలోని దూరాలను కొలవాలంటే కాంతి సంవత్సరమే ఆధారం. కోట్ల కొలది కాంతి సంవత్సరాల వరకూ విశ్వం విస్తరించి ఉన్నట్లు కనిపిస్తుంది.
"ఇటువంటి విశ్వానికి అంతు ఉన్నదా? లేదా?"
అని శాస్త్రవేత్తలకు సందేహాలు కలిగాయి.

కొందరు 'అంతువున్నదన్నారు. మరికొందరు 'లేదన్నారు'..

ఈ రెండు వాదాలనూ సమన్వయం చేస్తూ
ఒక కొత్తవాదాన్ని ప్రతిపాదించి విప్లవాత్మకమైన
మార్పు తీసుకువచ్చాడు ఒక మహావిజ్ఞాని.
అతడే ఆల్బర్ట్ ఐన్స్టీన్.

5 ఏండ్ల వయస్సులో తండ్రి ఇచ్చిన దిక్సూచి
అతడిలో శాస్త్ర జిజ్ఞాసకు అంకురార్పణ చేసింది.
12 సంవత్సరాల వయస్సులో “యూక్లిడ్" గణితం
ప్రభావితుడిని చేసింది. కొంత కాలానికి అతడి కుటుంబం ఇటలీ చేరుకున్నది. అక్కడి
నుండి చదువుకోసం స్విట్జర్లాండు వెళ్లాడు.

కొన్నాళ్లు అక్కడా ఇక్కడా చదివి 1896లో జ్యూరిచ్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో
చేరి చదివాడు. 1900 ఆగస్టులో పట్టా పుచ్చుకొని, స్విట్జర్లాండు పౌరసత్వం. పుచ్చుకున్నాడు.

1902లో ఒక పేటెంట్ కంపెనీలో గుమస్తాగా చేరాడు. పని చేస్తూ శాస్త్ర విషయాల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఆ ఆలోచనలను నోటు పుస్తకంలో రాసుకుంటూ ఉండేవాడు.

* 1905లో జ్యూరిచ్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి పి.హెచ్.డి. తీసుకున్నాడు.
అదే సంవత్సరం 5 ప్రసిద్ధ విషయాలను గురించి వివరించాడు. దానితో అతడికి ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తగా గుర్తింపు లభించింది.

మొదటి పత్రంలో "ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్" గురించి చర్చించాడు. ఇది ఎలక్ట్రానిక్స్ చరిత్రలో గొప్ప మార్పును తీసుకువచ్చింది. రెండవ పత్రంలో "బ్రౌనియన్ చలనాల గురించి" "రాశాడు. మూడవ పత్రం "విశిష్ట సాపేక్ష సిద్ధాంతానికి " సంబంధించింది. దీనిలో ద్రవ్యరాశి కాలము, దూరము గురించి చర్చించాడు. నాలుగో పత్రంలో పదార్దము, శక్తి గురించి పేర్కొన్నాడు. దానిని మనకందరికి పరిచితమైన E=mc" అనే సూత్రంలో పేర్కొన్నాడు.
ఐదవ పత్రంలో కాంతి గురించి దాని ప్రయాణాన్ని గురించి వివరించాడు. 1916లో “సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని" వివరించాడు. 30 ఏళ్ల వయస్సుకే జగద్విఖ్యాతి చెందాడు.గౌరవాలు, పదవులు అతడిని వరించాయి. 1910లో ప్రేగ్లో ఆచార్యపదవి, 1912లో జ్యురిచ్లో పూర్ణ ఆచార్య పీఠం లభించాయి.

1914లో అమెరికాలో పర్యటించి ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. ఆయన ప్రతిభకు మెచ్చి 1921లో నోబెల్ బహుమతిని ఇచ్చి గౌరవించారు. తన జీవితకాలం సైన్సును విడిచిపెట్టలేదు. ప్రపంచ శాంతిని గురించి పాటుపడ్డ శాంతి దూతగా కూడా పేరు తెచ్చుకున్న మేధావి ఐన్స్టీన్.

Post a Comment

If you have any doubts, please let me know