7. అలిస్సాండ్రో వోల్టా (ఇటలీ)
(1745-1827)
తీగ లాగితే డొంక కదుల్తుంది అంటారు. విద్యుచ్ఛక్తి శాస్త్రంలో ఈ మాట అక్షరాలా నిజమైంది. గాల్వనీ కప్ప కాళ్ళు, తీగలతో పరిశోధించి, ప్రయోగాలు జంతు విద్యుత్ గురించి ప్రపంచానికి తెలియచెప్పాడు. అనేక చోట్ల శాస్త్రవేత్తలు కప్ప కాళ్ళతో ప్రయోగాలు కొనసాగించారు. అలా కప్పకాళ్ళతో తంటాలు పడే జంతువిద్యుత్తును గట్టిగా వ్యతిరేకించాడు ఓ శాస్త్రవేత్త.
ఆ విద్యుత్ ఎక్కడి నుంచి వస్తున్నదోనని దృష్టి నిలిపి, విద్యుత్తు అనేది ఒక రసాయనిక
చర్య అని నిరూపించాడు. ప్రయోగాలు చేసి విద్యుత్ జనింపచేయటానికి కొత్త పద్ధతిని కనిపెట్టాడు. ఆ శాస్త్రజ్ఞుడే అలిస్సాండ్రో వోల్టా.
వోల్టా సొంత ఊరిలోనే విద్యాభ్యాసం చేశాడు. 1771లో అదే చోట ఉపాధ్యాయు డయ్యాడు. అప్పుడే విద్యుచ్ఛక్తి మీద శ్రద్ధ చూపించాడు. స్థిర విద్యుత్ని సులభంగా తయారు చేసే ఎలక్ట్రోఫోరస్ అనే పరికరాన్ని నిర్మించి వార్తలకెక్కాడు.
1779లో పాలియా విశ్వ విద్యాలయం ఆయనకు భౌతిక శాస్త్ర ఆచార్య పదవిని యిచ్చింది. విద్యుత్ని నిలువచేసే లేడెన్ జాడీలో ఎన్నో మార్పులు చేశాడు. కండెన్సింగ్ ఎలక్ట్రోస్కోపును నిర్మించాడు. ఈయన ప్రతిభను గుర్తించిన లండన్లో రాయల్ సొసైటీ
1791లో కో పతకం ఇచ్చింది.
విద్యుత్తు పుట్టుక గురించి తెలుసుకోవటానికి కప్ప కాళ్ళతో ఎన్నో తంటాలు పడ్డాడు.దానితో రెండు వేర్వేరు లోహాలు ఒక లవణ ద్రావణంలో ఉన్నప్పుడు రసాయన చర్య జరుగుతున్నది. అప్పుడు విద్యుత్ వెలువడుతుంది అని నిరూపించాడు. దానినే విద్యుత్ రసాయనిక చర్య అన్నాడు.
కప్పకాళ్ళలో లవణ ద్రావణం ఉన్నది. అదే
ఎలక్ట్రోలైట్గా పని చేస్తున్నది. దాని నుండే విద్యుత్ ప్రవహించి కాళ్ళు ముడుచుకుంటున్నాయి అనే విషయాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించాడు.
ప్రాణుల కణజాలంలో లవణ ద్రావణం వుంటుంది. దాని ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది అని చెప్పాడు. తన వాదన రుజువు చేయటానికి 1779లో వోల్టాయిక్ ఫైలును రూపొందించాడు. రాగి, జింకు, రేకు బిళ్ళలను తీసుకున్నాడు.సల్ఫ్యూరిక్ ఆమ్లమ్ లో ముంచిన అద్దుడు కాగితం బిళ్ళల్ని తీసుకున్నాడు. రాగి బిళ్ళపైన, జింకు బిళ్ళ మధ్య అద్దుడు కాగితం ఇలా వరుసగా పెట్టాడు. పైగా రాగి బిళ్లకు క్రింది భాగంలోని జింకు పలకకు వైర్లు బిగించి రెంటినీ కలిపాడు. అప్పుడు విద్యుత్తు ప్రవహించింది.ఇదే తర్వాత బ్యాటరీల తయారీకి దారి చూపింది.
దీనితో వోల్టా ప్రతిభ ప్రపంచమంతటా పాకింది. ఎందరో సన్మానించారు. 1881లో జరిగిన ఎలక్ట్రికల్ కాంగ్రెస్, విద్యుత్ శక్తి ప్రమాణానికి 'వోల్టు' అని పేరు పెట్టి గౌరవించింది.
విద్యుత్ హెచ్చు తగ్గులుగా రావటాన్ని హైవోల్టేజిలో వోల్టేజి అని ఆ శాస్త్రజ్ఞుడిని ప్రజలు ఎపుడూ తలుచుకుంటున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know