చార్లెస్ రాబర్ట్ రిచెట్ (ప్రాన్స్ )గురుంచి

చార్లెస్ రాబర్ట్ రిచెట్ (ప్రాన్స్ )
చార్లెస్ రాబర్ట్ రిచెట్ (ప్రాన్స్ )
(1850-1935)
రిచెట్ ప్యారిస్ లో ఉన్న విశ్వవిద్యాలయం నుండి 1877లో వైద్య శాస్త్రంలో డిగ్రీ తీసుకున్నాడు. అక్కడే 1887 నుండి 1927 వరకు శరీర శాస్త్ర ఆచార్యుడిగా పని చేశాడు.అతడు వైద్య శాస్త్రంలోనే కాకుండా సైకాలజీ, టెలీపతి, ఎయరోనాటిక్స్ మొదలైన ఇతర
శాస్త్ర విజ్ఞాన రంగాలలో కూడా కృషి చేశాడు.

అంతే కాకుండా రచయితగా మారి నవలలు, నాటకాలు, రాశాడు. మానసిక వైద్యం 
'పారా సైకాలజీ' ప్రమాద స్థితిని కలిగించే విషాల మోతాదుల గురించి చేసిన పరిశోధనలే అతడికి ఖ్యాతిని తెచ్చి పెట్టాయి.

శరీరంలోకి ఏదైనా మందును గానీ, ఇతర వస్తువును గానీ తీసుకున్నప్పుడు ఆ వస్తువు లేక మందు శరీరానికి సరిపడకపోవచ్చు. ఆ సమయంలో శరీరం ప్రతిచర్యను ప్రదర్శిస్తుంది. దీనినే “ప్రతికూల ప్రక్రియల క్రమభంగం (ఎలర్జిక్ డిసార్టర్) అంటారు. ఈ దశను “ఎనాఫిలాక్సిన్ రియాక్షన్' లేక “ఎనా ఫైలాక్సిన్" (తీవ్ర ప్రక్రియ) అంటారు. ఈ దశలో జీవధాతువులు మరియు ఇతర కారకాలు విడుదల అవుతాయి.

చిన్న రక్త కణాల నుంచి రక్తం కారవచ్చు. ఒక్కోసారి శరీరమంతా నీలంగా మారిపోతుంది. స్వరపేటిక, కంటి రెప్పలు, పెదవులు ఉబ్బిపోవటం జరుగుతుంది. శరీరం నిండా దద్దుర్లు వచ్చి దురదపుట్టవచ్చు. ఊపిరితిత్తుల్లో మార్పులు జరిగి శ్వాసపీల్చుకోవటం కష్టమై పోవచ్చు. చివరకు ప్రాణానికే అపాయం జరగవచ్చు. ఈ ఎనాఫైలాక్సిన్ గురించి అధ్యయనం చేసి ఈ విధమైన అధ్యయనాలకు దారి చూపినవాడు “చార్లెస్ రాబర్ట్ రిచెట్”.

తన పరిశోధనలు పారిస్ లో ఉన్న 'ఫాకల్టీ ఆఫ్ మెడిసన్'లోని 'శరీర ధర్మ పరిశోధనాలయంలో కొనసాగించాడు. తన పరిశోధనలకు సముద్రంలో లభించే 'ఎనిమోన్' అనే జీవులను ఎన్నుకున్నాడు.
వాటి స్పర్శకాల (టెంటాకిల్స్) నుంచి విషాన్ని తీసి కుక్కల్లో ప్రయోగించాడు. విషం మోతాదులు క్రమంగా హెచ్చిస్తూ పోయి జరిగే ప్రతి చర్యలను అధ్యయనం చేశాడు.

అప్పుడు కలిగిన ప్రతి చర్యలను అతడు 'ఎనాఫిలాక్సిన్' (తీవ్రప్రక్రియ) అని 1902లో పేరు 
పెట్టాడు. ఈ పరిశోధనలకు గాను 1913లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు.

వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవటానికి మార్గాలు లభించాయి. ఎనాఫిలాక్సిన్ వచ్చినప్పుడు తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవటం సాధ్యపడింది. ఈ విధమైన కృషి చేసినందుకు మానవాళి ఆయనకు ఎంతో రుణపడి ఉన్నదనటంలో సందేహం లేదు.

Post a Comment

If you have any doubts, please let me know