అమిడో అవగాడ్రో (ఇటలీ)

అమిడో అవగాడ్రో 

అమిడో అవగాడ్రో (ఇటలీ)
(1776-1856)
మొదటి సారిగా పరమాణు సిద్ధాంతాన్ని జాన్ డాల్టన్ ప్రతిపాదించాడు. నీటి అణువు
గురించి చెబుతూ, ఇది చాలా సరళమైందనీ, ఒక ఆక్సిజన్ పరమాణువు, మరొక హైడ్రోజన్
పరమాణువు కలిసి ఏర్పడిందని వివరించాడు. ఆ తర్వాత బెర్జీలియస్ సమాన ఉష్ణోగ్రత,
పీడనాల వద్ద సమాన ఘన పరిమాణాలు గల వాయువులు సమాన సంఖ్యలో పరమాణువులను
కలిగి ఉంటాయి అని ప్రతిపాదించాడు.

కానీ ఇది డాల్టన్ సిద్ధాంతానికి విరుద్ధం అయింది. వీటిలోని లోపాలను సరిదిద్ది ఆధునిక రసాయన శాస్త్రానికి, పరమాణుతత్వ విజ్ఞానానికి పునాది వేశాడు అమిడో అవగాడ్రో. ఆయన తండ్రి న్యాయవాది. అందువలన తన కొడుకుని కూడా న్యాయవాదిని చదివించాడు. 16వ యేట పట్టభద్రుడై, 20వ యేట డాక్టర్ పట్టా పుచ్చుకున్నాడు అమిడో అవగాడ్రో. అయినా అతడి ఆలోచనలు ఎప్పుడూ విజ్ఞాన శాస్త్రం వైపు సాగుతూ వుండేవి. రసాయన, భౌతిక, గణిత శాస్త్రాలలో స్వయంకృషి చేసి ప్రతిభ కనబరిచాడు.

అందుకని ఉత్తర ఇటలీలోని వర్సెల్లీలో ఉన్న చిన్న కాలేజీలో 1809లో ప్రొఫెసర్ పదవి ఇచ్చారు. 1820లో ట్యూరిన్ విశ్వవిద్యాలయంలో భౌతిక గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా నియమింపబడ్డాడు. వర్సెలీలో ఉన్నపుడే ఎన్నో పరిశోధనలు, ప్రయోగాలు చేశాడు.

ప్రపంచ ప్రసిద్ధి పొందిన అవగాడ్రో సిద్ధాంతాన్ని అక్కడే రూపొందించాడు. ఈ విషయాన్ని 1811లో జర్నల్ డే ఫిజిక్స్ అనే పత్రికలో వివరించాడు. ఆ కాలంలో అతని వివరణలకు అంత ప్రచారం రాలేదు. ప్రచారం రావటం అనేది 50 సం॥ల తర్వాత జరిగింది.

1860లో కార్ల్ స్రుహో అనే పట్టణంలో రసాయన శాస్త్ర కాంగ్రెస్ జరిగింది. అక్కడ కాని జార్ అనే శాస్త్రవేత్త అమిడో అవగాడ్రో సిద్ధాంతాన్ని బయటపెట్టి దానిలోని సత్యాలను వెలుగులోనికి తెచ్చాడు.

పీడనం, ఉష్ణోగ్రతలు సమానంగా ఉన్న సర్వ సమమైన పరిస్థితులలో సమాన ఘన

పరిమాణం వున్న వాయువులలో సమాన సంఖ్య గల అణువులు ఉంటాయి అన్నది అతడి

సిద్దాంతంలోని ముఖ్యమైన అంశం... డాల్టన్ సిద్ధాంతం ప్రకారం H.O.. అవుతుంది.

కానీ అమిడో అవగాడ్రో సిద్ధాంతం ప్రకారం H2O. అవుతుంది. ఇప్పుడు ఇదే ప్రచారంలో ఉన్నది.

అమిడో అవగాడ్రో కాలంలో సున్నితమైన పరికరాలు లేవు. అందువల్ల అణువుల లెక్కలు సరిగ్గా వేయలేకపోయాడు. తర్వాత శాస్త్రజ్ఞులు ఆ లోటుని పూరించారు. ప్రమాణ పీడనము, ఉష్ణోగ్రత ఉన్నప్పటికి మన సెంటీమీటరు వాయువులో 2.687 × 10" అణువులు ఉంటాయన్నారు.

ఈ సంఖ్యకు అమిడో అవగాడ్రో జ్ఞాపకార్ధం అవగాడ్రో సంఖ్యలని పిలుస్తున్నారు.అలా అతని పేరు వైజ్ఞానిక ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయింది.


Post a Comment

If you have any doubts, please let me know