used to, learn English through Telugu

used to, learn English through Telugu
 ఇంతకుముందు used to గురించి మనం నేర్చుకున్నాం.ఆ used to కి ఇప్పుడున్న వాటికి తేడా మీరే గమనించండి.

I            am, got, was not   used to

We
You      are, got, were not   used to 
They

He
She      is, got, was not      used to
It

Was not used to / were not used to = అలవాటు ఉండేది కాదు

Got used to         = అలవాటు పడ్డాము

Am used to/are used to/is used to =
అలా అలవాటు అయిపోయింది.

ఇందులో verb కి ing form వస్తుంది.

Examples :
Was not/were not
 నాకు early morning 4:00 కి లేవడం అలవాటు ఉండేది కాదు.
 I was not used to getting up at 4 o'clock in the morning

 నాకు పల్లెటూర్లో ఉండడం అలవాటు ఉండేది కాదు.
 I was not used to living in villages

 నా బ్రదర్ కి పల్లెటూరులో ఉండడం అలవాటు ఉండేది కాదు.
 My brother was not used to living in villages.

 మాకు సిటీ లో ఉండడం అలవాటు ఉండేది కాదు.
 We were not used to living in city.

Got used to:
 ఉదయం నాలుగు గంటలకు లేవడానికి నేను అలవాటు పడ్డాను.
 I got used to getting up at 4 o'clock in the morning

 మా అన్న పల్లెటూర్లో ఉండడానికి అలవాటు పడ్డాడు.
 He got used to living in villages.

 మేము సిటీలో ఉండడానికి అలవాటపడ్డాము.
 We got used to living in city.

am used to/are used to/is used to:
 నాకు ఉదయాన్నే నాలుగు గంటలకు లేవడం అలవాటైపోయింది.
 I am used to getting up at 4 o'clock in the morning

 అతనికి విలేజ్ లో ఉండడం అలవాటైపోయింది.
He is used to living in villages

 మాకు సిటీ లో ఉండడం అలవాటైపోయింది.
 We are used to living in city.

వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏


Post a Comment

If you have any doubts, please let me know