దెయ్యాలు ఉన్నాయా?? మూఢ నమ్మకాలు నమ్మొచ్చా??

దెయ్యాలు ఉన్నాయా లేవా??
 మూఢనమ్మకాలు నమ్మొచ్చా??
దెయ్యాలు ఉన్నాయా లేవా?? మూఢనమ్మకాలు నమ్మొచ్చా లేదా అని నా జీవితంలో జరిగిన కొన్ని నిజమైన సంఘటనలు ను ఈ ఆర్టికల్ లో పొందుపరచడం జరిగినది.

నేను సాధరణంగా మూఢ నమ్మకాలు వీటి మీద నమ్మకాలు ఉండేవి కాదు, కానీ

ఒక రోజు మా నాన్న గారు పొలం దగ్గరికి వెళ్లారు, పొలం పని చేస్తుండగా విషపు తేలు కుట్టడం జరిగింది. అది విషపు తేలు,ఏ విధంగా గా అయితే పాములలో విషం గల పాములు, విషం లేని పాములు ఉంటాయో అదే విధంగా తేళ్లు కూడా ఉంటాయి. అది చాలా విషపూరీతమైన తేలు. 10 కిలోమీటర్ దూరం లో ఒక హాస్పిటల్ ఉంది. ఆటో అందుబాటులో ఉండడంతో మా నాన్నగారిని ఆటో లో తీసుకెళ్తున్నాము.

అలా వెళ్తూండగా నేను ఆటో అన్న తో ఇలా అన్నాను, అన్న తొందరగా పోనివ్వండి అన్న తొందరగా ఇంజక్షన్ వేపిస్తే తగ్గిపోతుంది ఆటో అన్నతో అన్నాను. అపుడు ఆటో అన్న ఇంజక్షన్ ఏమి అవసరం లేదు, నాకు తెలిసిన ఒక అవ్వ ఉంది, ఆమె మంత్రం వేస్తే తగ్గిపోతుంది అని అన్నాడు.
నేను అది నమ్మలేదు, నేను ఆటో అన్నతో ఇలా అన్నాను. ఎటువంటి treatment లేకుండా, ఒక మంత్రం తో ఎలా బాగోవుతుంది అని, కానీ ఆటో అన్న నాతో, లేదు compulsary గా బాగోవుతుంది అని అన్నాడు నా మాట నమ్మండి అని అన్నాడు. అయినా నాకు నమ్మకం కలగలేదు, అయినా విషపు తేలు కుడితే ఎటువంటి treatment లేకుండా ఒక చిన్న మంత్రంతో ఎలా బాగోతుందని, కానీ ఆటో అన్న  మాత్రం confident గా చెపుతున్నాడు బాగోతుందని. ఆ మాటలు విని మా నాన్న కూడా అక్కడికే వెళదామని చెప్పాడు, సరే అని నేను కూడా వాళ్ళ మాటల్ని నమ్మి మా నాన్నని అక్కడికి తీసుకెళ్ళాను.

అక్కడ ఒక చిన్న పూరి గుడిసెలో ఒక అవ్వ ఉంది, అపుడు అవ్వకి జరిగిన విషయం తేలు కుట్టిందని చెప్పాము. అక్కడ చిన్న వినాయక దేవుని విగ్రహం ఉంది.అపుడు అవ్వ మా నాన్నతో 100 రూపాయలు ఆ దేవుని దగ్గర పెట్టి, దండం పెట్టుకోమని చెప్పింది. ఆమె చెప్పినట్లుగా 100 రూపాయలు పెట్టి దండం పెట్టుకున్నాడు. తర్వాత ఆమె మా నాన్నకి ఎదురుగా నిలుచుకుని ఏదో మంత్రం చదివింది.

విచిత్రమేమిటంటే తేలు కుట్టింది మా నాన్న చూపుడు వేలు కి, కానీ ఆమె చూపుడు వేలుకి కట్టు కట్టుకుంది. కట్టుకట్టుకుని మా నాన్న గారి ఎదురుగా నిలుచుకుని మంత్రం చదివింది.మంత్రం 2 నుంచి 3 నిముషాలు చదివింది.చదివిన ఐదు నిముషాలు తర్వాత నేను shock అయ్యాను, తేలు కుట్టి భయంకరంగా బాధపడుతున్న మా నాన్న దెబ్బతో silent అయ్యాడు. నాకు ఏమి అర్ధం కాలేదు, ఎటువంటి treatment లేకుండా విషం 10 నిమిషాలో ఎలా తగ్గిందని, తర్వాత నేను నమ్మాల్సి వచ్చింది, ఎందుకంటే కళ్లారా చూసాను కాబట్టి.
 నమ్మాలా వద్దా అని మీ విషయానికే వదిలేస్తున్నాను.

దెయ్యాలు ఉన్నాయా లేవా??

నా జీవితం లో జరిగిన సంఘటనలు

అది ఏమిటి అనేది ఇప్పటికి షాకె!!

అర్ధరాత్రి time 1:30 to 1 :45, మా పొలం లో బోరు వేస్తున్నాము.అక్కడ బోరు వేసేవాళ్ళు మా పొలం లో బోరుదగ్గర బండి దగ్గర ఉన్నారు. నేను మా నాన్న మరియు మా పక్క పొలం లో ఉన్న ఇద్దరు,మొత్తం మేము నలుగురుము.

 కానీ మేము మా పొలం gate దగ్గర నేను, మా నాన్న మరియు ఇంతకు ముందు చెప్పాను కదా మా పక్క పొలంలో ఇద్దరు అని, వాళ్ళల్లో ఒక అతను మాత్రమే మాతో ఉన్నాడు. అంటే నేను, మా నాన్న మరియు అతను మొత్తం ముగ్గురు. మేము ముగ్గురుమ్ మా పొలం gate దగ్గర మేము ముగ్గురుమ్ మాట్లాడుతున్నాము. అలాగే మాట్లాడుతున్న సమయంలో  దారిలో ఒక అతను నడుచుకుంటూ వస్తున్నాడు, ఆ దారి కుడివైపున, వెడమ వైపున దారులు లేవు.

అక్కడ ఉన్నది ఒకే దారి, రావాలన్నా!పోవాలన్నా ఆ దారి గుండా నే పోవాలి, రావాలి. అక్కడ ఆ దారి గుండా ఒక అతను white dress లో వస్తున్నాడు కొంచెం దూరంలో, మేము ముగ్గురు normal గా మాట్లాడుతున్నాము.
మేము ఆయన్ని ఎవరు అనుకున్నామంటే ఇంతకుముందు చెప్పాను కదా నేను మానాన్న మరియు ఇద్దరు అని, అందులో ఒక అతను మా దగ్గరే ఉన్నాడు, వేరే అతను వాళ్ళ పొలం లో ఉన్నాడని, లేక బయట ఉన్నాడని అనుకున్నాము.కానీ అక్కడ వచ్చే ఆయన్ని చూసి మేము ఆయనే వస్తున్నాడని అనుకున్నాము.

ఆయన మొదటినుంచి తెల్ల పంచి మరియు వైట్ dress అయన మొదటినుంచి అలాగే వస్త్రాదారణ ఉండేది, వయసులో కూడా పెద్దవారు.మేము వచ్చే ఆయన్ని చూసి ఆయనే అనుకున్నాము.సర్లే బోరు దగ్గరుకు వస్తున్నాడులే అనుకున్నాము.అలాగే మాట్లాడుకుంటున్నాము కానీ shock, దారి లో వస్తున్న అతను ఒక్కసారిగా కనిపించలేదు, మేము ముగ్గురుము shock అయ్యాము, ఇరు పక్కల ఎటువంటి దారి లేదు,అది అర్ధరాత్రి.

ఆయన చాలా వరకు మాకు దగ్గర్లో వస్తున్న, ఆయన ఒక్కసారిగా కనిపించలేదు.మేము ముగ్గురుము shock అయ్యాము. వెంటనే మేము బోరు దగ్గరకు వెళ్ళాము, అక్కడ చూస్తే ఇంకొక shock మేము అనుకున్న పెద్దాయన ఆ బోరు దగ్గరే ఉన్నాడు. దేవుడా అనుకుని మాకేమి అర్ధం కాలేదు, మేము ఆయన్ని అడిగాము, ఇప్పుడే కదా మీరు ఆ దారి నుండి వస్తున్నారు ఇంతలో ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆయన్ని అడిగాము. ఆయన ఈ విధంగా సమాధానమిచ్చాడు,నేను ఈ బోరుదగ్గరే ఉన్నాను ఎక్కడకి పోలేదు, అర్ద గంట నుండి ఇక్కడే ఉన్నాను అని. మాకు దిమ్మ తిరిగి mind block అయింది.

దేవుడా అనుకున్నాము!! 



Post a Comment

If you have any doubts, please let me know