గతంలో అలవాటుగా చేసే పనులను తెలియజేయడానికి "used to " అనే helping verb ను use చేయాలి.
గతంలో ఉన్న అలవాట్లకు used to ఉపయోగించాలి.
Subject + used to+verb1 + extra words
My friend used to smoke once.
ఒకప్పుడు నా స్నేహితుడు పొగత్రాగేవాడు.
My father used to go for walk every day. మా నాన్నా రోజూ walking కి వెళ్ళేవాడు.
When I was in Bangalore, I used to speak in Englsh only.
నేను బెంగుళూరులో ఉన్నప్పుడు, ఇంగ్లీషులోనే మాట్లాడేవాడిని.
In 10th class, we used to play shuttle till 8:AM.
మేము 10వ తరగతి చదివేటప్పుడు తెల్లవారి 8 వరకు షటిల్ ఆడేవాడిని.
ఒక సంవత్సరం క్రితం వరకు ఆమె మా ఇంటికి వస్తూ ఉండేది.
She used to come to my house until one year back.
ఒక నెల క్రితం వరకూ ఆమె నాకు అన్ని విషయాలు చెప్తూ ఉండేది.
She used to tell me everything until one month back.
ఇందిరాగాంధీ రోజుకు 18 గంటలు పనిచేసేది.
Indira Gandhi used to work 18 hours a day
ఆమె ఎప్పుడూ చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉండేది. She always used to play with children.
నా బాల్యంలో మా అమ్మమ్మ మంచి కథలు చెప్తూ ఉండేది.
My grand mother used to tell me nice stories during my childhood.
వాళ్లు ఎప్పుడూ నాకు సమస్యలు సృష్టిస్తూ ఉండేవారు.
They always used to create problems to me.
కాంగ్రెస్పార్టీ తరచుగా ముఖ్యమంత్రులను మారుస్తూ ఉండేది.
Congress Party used to change it's Chief Ministers frequently.
అతను రోజుకు 20 కిలోమీటర్లు నడిచేవాడు.
He used to walk 20 KMs a day.
ఆ రోజుల్లో నేను వారానికి నాలుగైదు సినిమాలు చూసేవాడిని.
In those days I used to see 4 to 5 movies for a week.
ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండేవారు.
In those days everybody used to be sincere.
Negative: didn't use to
ఇందిరా గాంధీ రోజుకి 18 గంటలు పని చేసేది కాదు
Indira Gandhi didn't use to work 18 hours a day.
అతను రోజుకు 20 కిలోమీటర్లు నడిచేవాడు కాదు
He didn't use to walk 20 KMs a day.
ఆ రోజుల్లో నేను వారానికి నాలుగైదు సినిమాలు చూసేవాడిని కాదు
In those days I didn't use to see 4 to 5 movies for a week.
Used to make:
I used to make them learn painting.
నేను వారికి పెయింటింగ్ నేర్పించేదాన్ని.
నేను వాళ్ళకు ఉత్తరాలు వ్రాయిస్తుండేవాడిని.
I used to make them write letters.
ఆమె వాళ్ళకు సంగీతం నేర్పిస్తుండేది.
She used to make them learn music.
మేము వాళ్ళతో పాటలు పాడిస్తుండేవాళ్ళము. We used to make them sing songs.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know