simple past tense, learn English through Telugu

simple past tense, learn English through Telugu
 జరిగిపోయిన విషయాలు,జరిగిపోయిన పనులు గురించి simple past లో చెప్పాలి.

I
We
You
They           verb 2
He
She
It

Subject+verb2+object +extra words

Positive:

ఆమె తన నాన్నగారికి ఉత్తరం వ్రాసింది.
She wrote a letter to her father.

నేను ఆ సినిమా చాలాసార్లు చూశాను. 
I saw that movie many times.

నేను ఫైల్లు పంపించాను.
 I sent the files.

 రెండు రోజుల కిందట వాళ్లు ఇక్కడకు వచ్చారు. They came here two days ago.

నేను ఆమెకు చాలా ఉత్తరాలు వ్రాశాను. 
I wrote many letters to her.

 నేను తిరుపతి చాలాసార్లు వెళ్లాను. 
I went to Tirupathi many times.

నేను రెండు రోజుల క్రితం నిన్ను మోహినీ థియేటర్ దగ్గర చూశాను..
I saw you at Mohini Theatre two days ago.

విజయవాడ నుండి వాళ్లు ఇక్కడకు వచ్చారు. 
They came here from Vijayawada.

నేను ఎక్కువగా తినేశాను. 
I ate a lot of food.

 ఆమె మార్కెట్కి వెళ్లి కూరగాయలు కొన్నది. 
She went to market and bought vegetables.

ఆమె కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్లింది. She went to market to buy vegetables.

నాగార్జున వాళ్ళ ఆవిడకి విడాకులు ఇచ్చాడు. Nagarjuna divorced his wife.
 
నాగార్జున అమలను పెళ్లిచేసుకున్నాడు. Nagarjuna married Amala

 వాళ్లంతా ఇక్కడకి వచ్చారు.
They all came here.

మా కుటుంబ సభ్యులతో కలిసి నేను ఆ సినిమా చూశాను.
I saw that movie along with my family members.

క్రిందటి సంవత్సరం అనకాపల్లి దగ్గర మేము ఒక ఫ్లాట్ కొన్నాము.
 We purchased a Flat at Anakapalli last year.

నేను నా ఓటును కాంగ్రెస్కి వేశాను. 
I cast my vote to congress party.

Negatives:

Negatives కి ( did not or didn't ) add చేయాలి.

నిన్న నేను అక్కడకు వెళ్లలేదు. 
I did not go there yesterday

నేను హైదరాబాద్ ఒకసారి కూడా వెళ్లలేదు. 
I did not go to Hyderabad even once

వాళ్లు ఇక్కడకు రాలేదు. 
They did not come here.

 ఆ విషయం గురించి నీవు నాకు చెప్పలేదు. 
You did not tell me about that matter.

వాళ్లు నాకు అలా చెప్పలేదు.
They didn't tell me like that / so.

నిన్న నేను ఎక్కడకీ వెళ్లలేదు. ఇంటి దగ్గరే ఉన్నాను. Yesterday I didn't go anywhere I stayed at home only.

నేను లేటుగా రాలేదు. వేగంగానే వచ్చాను.
I didn't come late. I came early.

 నేను కలకత్తా వెళ్లాను కాని కాశ్మీర్ వెళ్లలేదు. 
I went to Calcutta but I didnot go to Kashmir.

 నీవు ఆ సినిమా చాలాసార్లు చూసావు, కాని నేను ఒక్కసారి కూడా చూడలేదు. 
You saw that movie many times but I didn't see even once.

 నేను ఎవరికీ ఏ హానీ చేయలేదు. 
I didn't do any harm to anyone.

 నేను ఎప్పుడూ ఎవరికీ ఏ హానీ చేయలేదు. 
I never did any harm to anybody.

ఏ విషయంలోనూ నేను వాళ్ల సహాయం కోరలేదు.
I didn't seek their help in any matter.

Questions :

 నేను ఆ సినిమాని చూశాను.
 I saw that movie.

 నువ్వు ఆ సినిమా చూశావా?
 Did you see that movie?

 నీవు ఆ సినిమాని చూడలేదా?
 didn't you see that movie?
           (Or)
Did you not see that movie?

 ఆ సినిమాని నువ్వు ఎందుకు చూడలేదు?
 Why didn't you see that movie?


ఆ విషయం గురించి నీవు నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు.
Why didn't you tell me about that matter till now / so 

నీవు ఆ సినిమా ఎన్నిసార్లు చూశావు? 
Howmany times did you see that movie?

ఈ నెలలో నీవు ఏ సినిమా చూశావు? 
Which movie did you see in this month? 

నేను నీకు అలా చెప్పానా? 
Did I tell you like that / so. 

నేను నీకు ఏమి చెప్పాను?
What did I tell you? 

ఆ విషయం గురించి నీవు నన్ను ఎందుకు అడిగావు? Why did you ask me about that matter? 

నీవు ఆ సినిమా చూశావా? 
Did you see that movie?

నీవు ఆ సినిమా ఎప్పుడు చూశావు? 
When did you see that movie?

నీవు అక్కడ ఏమి చేశావు? 
What did you do there? 

ఆ విషయం గురించి నీవు నాకు ఎప్పుడు చెప్పావు? When did you tell me about that matter? 

వాళ్లు నీకు ఏమి ఇచ్చారు? 
What did they give you?

నీవు ఇక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యావు?
 When did you join here?

నీవు నీ వాచీ ఎక్కడ విడిచిపెట్టేశావు?
Where did you leave your watch?

నీవు ఆ పుస్తకం ఎక్కడ మర్చిపోయావు?
Where did you forget that book?

Positive, negative మరియు questions కి తేడాలను గమనించి వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏🙏🙏🙏



Post a Comment

If you have any doubts, please let me know