అలెగ్జాండర్ గ్రాహంబెల్ (అమెరికా)
"మిస్టర్ వాట్సన్, కమ్ హియర్ ప్లీజ్! ఐవాంట్ యూ” అని మొట్టమొదటగా టెలిఫోన్ పలికింది. అది విని, తన చెవులు తాను నమ్మలేకపోయాడు వాట్సన్. ఫోన్ అక్కడ పడేసి,రెండేసి మెట్లు చొప్పున అంగలు వేసుకుంటూ, చిటికెలో మేడమీదికి పరిగెత్తాడు. “వినిపించాయి
నీ మాటలు - నువ్వు చెప్పినదంతా వినిపించేసింది.... స్పష్టంగా!" అని అరుస్తూ, వగరుస్తూ బెల్ గదిలోకి ప్రవేశించాడతను. బెల్
సంతోషానికి అంతులేదు. వాట్సన్ సహా
యంతో బెల్ చేస్తున్న ప్రయోగాలు అప్పటికి సఫలమయ్యాయి. తొలిసారిగా బెల్ తయారుచేసిన
టెలిఫోన్ పనిచేయడం మొదలు పెట్టింది.అది 1876 మార్చి పదోతారీఖు. స్వదేశంలో అయినా, ఖండాంతరంలో అయినా, ఎంతదూరంలో ఉన్న వారితో అయినా సూటిగా మాట్లాడ్డానికి ఒక సాధనాన్ని ప్రసాదించిన చరిత్రాత్మకమైన రోజు అది.
ఆ సాధనాన్ని నిర్మించిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ 1847లో మార్చి మూడోతారీఖున ఎడిన్బర్గ్ లో జన్మించాడు.తండ్రి ప్రసిద్ధ ఉపాధ్యాయుడు. దృశ్చాచ్చారణ (విజిబిల్ స్పీచ్) మీద ఒక శాస్త్రాన్ని రూపొందించిన వాడాయన.
రకరకాల శబ్దాల ఉచ్ఛారణను సంకేతాలతో సూచించే విధానాన్ని ఆయనరూపొందించాడు. హైస్కూల్లో చదువుకొనే రోజులలో ఒకసారి గ్రాహంబెల్ తన తోటిపిల్లలతోపాటు ఒక మిల్లు చూడ్డానికి వెళ్లాడు. ఆ మిల్లులో గోధుమ కంకులు ఇచ్చి వీళ్ళనిపొట్టు తీసివేయమన్నారు. గ్రాహం బెల్ వాటిని ఇంటికి తీసుకువచ్చి తన దగ్గరున్న నెయిల్
'బ్రష్ రుద్ది సులువుగా చక్కగా పొట్టు తీసేశాడట. వెంటనే ఆ మిల్లు యజమాని గ్రాహంబెల్న మెచ్చుకొని బెల్ చెప్పిన పద్ధతిమీద తన మీల్లులో యంత్రాలు మార్చుకున్నాడు.గ్రాహం బెల్కి పాతికేళ్ళయినా రాకుండానే క్షయవచ్చిందనుకొన్నారు. అంతా భయపడి,
వెంటనే అతనిని తీసుకొని కెనడా వెళ్లారు. గ్రాహం బెల్ ఆరోగ్యం నెమ్మదిమీద బాగుపడింది.
చెవిటివాళ్లకి భాష నేర్పే ఉపాధ్యాయులు కు శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టాడతను, బోస్టన్
నగరంలో, అన్ని రకాల పదాల ఉచ్ఛారణలూ విశ్లేషించి అవి ఎట్లా ఏర్పడుతున్నాయో
వాళ్లకి వివరించాడతను. గ్రాహం బెల్ ప్రత్యేక కృషిని బోస్టన్ విశ్వవిద్యాలయం అధికారులు గుర్తించారు. స్వరోత్పత్తి గురించి క్షుణ్ణంగా బోధించడానికి ప్రాచార్యుడుగా చెవిటివాళ్లకి ఉచ్ఛారణ నేర్పడమంటే గ్రాహం బెల్కి సరదా. మాబెల్ హబార్డ్ అనే చెవిటిపిల్లను పెళ్లిచేసుకున్నాడు కూడా.
ఒక తీగ వెంబడి ఏకకాలంలో టెలిగ్రాం ద్వారా సమాచారాలు పంపడం గురించి గ్రాహం బెల్ పరిశోధిస్తున్న రోజులవి. విద్యుత్తు సహాయంతో మాటలు ప్రసారం చేయడం సాధ్యమా అనే ప్రశ్న అతనికి స్ఫురించింది. అయితే, తన సమస్యను వెంటనే విశ్లేషించి, అందులోని సూత్రాన్ని అతను సూటిగా గమనించాడు. చనిపోయిన మనిషి చెవి ఒకటి తీసి అది ఎట్లా పనిచేస్తుందో పరిశీలించాడు.
మాట్లాడినప్పుడు ఆయా శబ్దాలకి తగ్గట్టు, గాలి అణువులలో కదలికలు జనిస్తూ ఉంటాయి. ఆ కదలికలకు అనుగుణంగా చెవి గూబ కంపిస్తుంది. గూబకు ఆనుకున్న ఎముకల గొలుసు కదిలి తద్వారా శ్రవణజ్ఞానం కలుగుతోంది. చెవి నిర్మాణంలో గూబకి ఉండే ప్రాధాన్యాన్ని బెల్ గుర్తించాడు. మాటల్ని బట్టి గాలిలో ఏర్పడే తరంగాలలాగే, తీగలో ప్రవహించే విద్యుత్ప్రవాహంలో కూడా మార్పులు వస్తే ధ్వనిప్రసారం చేయవచ్చు అనుకున్నాడు
బెల్. ఆ దృష్టితో బెల్ కొనసాగించిన కృషి ఫలితంగా 'టెలిఫోన్' తయారయింది.
మాటలు గ్రహించేందుకు మైక్రోఫోన్, వినిపించేందుకు రిసీవరు అనే రెండు భాగాలు ఆశ ఒకే వలయంలో ఉంటాయి. ఈ రెండూకలిసి టెలిఫోన్ అవుతుంది. అయితే మాటలకు తగ్గట్టు కంపించే పల్చని అల్యూమినియం రేకువంటి డయాఫ్రం మైక్రోఫోన్లో ఉంటుంది. దాన్ని ఆనుకొని కర్చన కణాలు ఉంటాయి.
బాటరీనుంచి విద్యుత్తు బయలుదేరి డయాఫ్రం చేసే ప్రకంపనాలకు అనుగుణంగా కర్చనకణాలు కూడా కదిలి విద్యుత్ప్రవాహ మార్గంలో నిరోధాన్ని మారుస్తాయి. అందువల్ల విద్యుత్ప్రవాహం మారుతుంది. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్కి చేరుతుంది. ఆ విద్యుత్ప్రవాహంలోని మార్పుల కనుగుణంగా ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే విద్యుత్ప్రవాహం మారుతూ ఉంటుంది.
విద్యుత్ప్రవాహంలో మార్పులకు తగినట్టు ఆ అయస్కాంత ధృవాల ఆకర్షణబలం స్వతం
మారుతూ, డయాఫ్రంను కంపింపజేస్తూ ఉంటుంది. ఆ రేకును ఆనుకొని ఉన్న గాలికణాలు
కూడా కదిలి, ధ్వని వినిపించేలా చేస్తున్నాయి. క్లుప్తంగా చెప్తే, టెలిఫోన్ పనిచేసే తీరు ఇది.
మైక్రోఫోన్, రిసీవర్ పోనుపోను చాలా మారాయి. వాటిలో చాలారకాలు వచ్చాయి. రెండింటినీ
దగ్గిరగా బిగించి ఉంచి ఆటోమాటిక్గా డయల్ తిప్పితే పనిచేసే సాధనంగా ఇప్పుడు టెలిఫోన్
వాడుకలో ఉంది.
తాను చేసిన టెలిఫోన్ నిర్మాణం మీద వ్యాపారపు హక్కుల కోసం, పేటెంట్ నిమిత్తం బెల్ దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆ రోజునే మరో రెండుగంటలు గడిచాక, ఎలీషా గ్రే అనే ఆయన షికాగోనుంచి వచ్చి తానూ దరఖాస్తు పెట్టాడు. ఎడిసన్ డాల్ బేర్, డేనియల్, డ్రాబా అనేవారు కూడా అదే రంగంలో పనిచేస్తున్నారు. మేమంతా టెలిగ్రాఫ్కి మెరుగులు
దిద్దుతున్నామనీ, టెలిఫోన్ నిర్మించామనీ, బెల్తో పోటీకి వచ్చారు. పేటెంట్ హక్కులు చిక్కుల్లో పడ్డాయి. బెల్ కోర్టుకెక్కాడు.
ఇది ఇట్లా ఉండగా, ఫిలడల్ఫియాలో పెద్ద ఎగ్జిబిషన్ జరిగింది. తన టెలిఫోన్ తీసుకునివచ్చి, బెల్ అందులోకి ప్రవేశించాడు. తాను ఒకచోట దూరంగా నిలబడి, ఫోను ఒకచోట * ఏర్పాటుచేశాడు. కాని మొదట్లో దానిమొహం ఎవరూ చూడలేదు. బ్రెజిల్ చక్రవర్తి అయిన డాన్ పెడ్రో అనే ఆయన ఎగ్జిబిషన్ చూడ్డానికివచ్చి, ఆ ఫోన్ తీసి చెవిదగ్గర పెట్టుకున్నాడు. గ్రాహం బెల్ అటుపక్కనుంచి, “టుబి ఆర్ నాట్ టుబి” అనే హామ్లెట్ ప్రఖ్యాత స్వగతవాక్యాలు చదివాడట. అది విని, “అరే, ఇది మాట్లాడుతోందే!" అని చక్రవర్తి ఫోన్ కేసి చూసి
ఆశ్చర్యపడ్డాడట. అప్పటినుంచి బెల్ టెలిఫోన్ బాగా ప్రచారంలోకి వచ్చింది.
టెలిఫోన్లు వ్యాపారసరళిలో తయారుచేయడం బెల్కి కష్టమయింది. పెట్టుబడికి డబ్బు లేదు. మామగారి సాయంతో, వాట్సన్ సహకారంతో ఎలాగైతేనేం ఒక కంపెనీ స్థాపించాడు బెల్.
థామస్ సాండపార్స్ అనే మరోమిత్రుడు ఆ కంపెనీకి తగినంత ఆర్థికసహాయం చేశాడు. కోర్టు వ్యవహారం తన పరమే అయింది. ఎడిసన్ గాని మరొకరుగాని చేసిన అప్పీళ్లు అన్నీ కొట్టేసి టెలిఫోన్ మొట్టమొదట అలెగ్జాండర్ గ్రాహం బెల్ నిర్మించాడని కోర్టువారు
తీర్పు చెప్పారు. అయినా, ఎడిసన్ వంటి ఇతర ప్రసిద్ధ విజ్ఞానులు కూడా తమంతట తామే
స్వతంత్రంగా టెలిఫోన్ వంటి సాధనాల్ని నిర్మించగల సమర్థులని మనం మరిచిపోకూడదు.
టెలిఫోన్ కంపెనీ ఏర్పరిచిన కొద్దిరోజులకే బెల్ ధనవంతుడయ్యాడు. ఆ వ్యవహారాలు వాట్సనికి, మిగిలినవారికి వదిలేసి బెల్ ఒక పల్లెటూరు జేరుకున్నాడు. ప్రశాంతంగా ప్రయోగాలు చేసుకుంటూ కొత్తకొత్త సాధనాలు నిర్మించడం మొదలు పెట్టాడు.
బెల్, కాంతివల్ల ధ్వనిని ప్రసరింపజేయడానికి ఫోటోఫోన్, ధ్వనివల్ల గూబవంటి పల్చని పొరలో కలిగే ప్రకంపనాలనొక గ్రామా చిత్రీకరించడానికి గ్రాఫోఫోన్ తయారుచేశాడు.అయితే బెల్ చేసిన గ్రాఫోఫోన్ కంటే ఎడిసన్ తయారుచేసిన ఫోన్
గ్రాఫ్ ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది.
ఇతర రంగాలలో కూడా బెల్ ప్రయోగాలు చేశాడు. గాలిలోకి రకరకాల గాలిపటాలు ఎగరేశాడు. మనిషిని అంతరిక్షంలోకి పంపాలని బెల్ ఆనాడే ఆలోచించాడు. అయితే సాధ్యంకాలేదు. బెల్ నిరుత్సాహపడలేదు. ప్రయోగాలు మానలేదు. కవలపిల్లల్ని పెట్టే ఒక రకం గొర్రెజాతిని సృష్టించాలని కొన్నాళ్ళు బెల్ ప్రయోగాలు చేశాడు. అవి సఫలం కాలేదు.జంతువులకు మనుష్యభాష నేర్పాలనుకున్నాడు. ఒక కుక్కకు కొన్ని శబ్దాలు నేర్పాడు. సరిగా బెల్ పలికినట్లే అదీ అరిచేది, విచిత్రంగా.
శబ్దాల ఉచ్ఛారణమీద, చెవిటివాళ్లకి భాషాబోధన మీద గ్రాహంబెల్ సిద్ధాంతాలు ప్రమాణాలుగా భావిస్తారు. కొన్నేళ్లు ఆయన నేషనల్ జియాగ్రఫిక్ సొసైటీకి అధ్యక్షుడుగా,స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కి రీజెంట్గా పనిచేశాడు. 1920లో తన జన్మస్థలమైన ఎడింబరోఒకసారి వెళ్లి, ఘనంగా సన్మానాలు అందుకొని తిరిగివచ్చాడు. గ్రాహంబెల్ తాను నిర్మించిన టెలిఫోన్ దేశదేశాల వ్యాపించడం, ఈలోగా వైర్లెస్ కూడా తయారయి,తన టెలిఫోన్కి
తోడ్పడం చూసి సంతోషించాడాయన.
తన దేశస్తుల్లాగా బెలు, వ్యాపారంలో మెలకువలు తెలియవు. వ్యాపారంలో శ్రద్ధలేదు.పల్లెటూరు పోయి, కంపెనీ నుంచి వచ్చిందేదో తీసుకుంటూ, అస్తమానూ ప్రయోగాలూ పరికరాలూ చూసుకుంటూ కూచునేవాడు బెల్.
ఆయన చేసిన ప్రయోగాలు చాలావరకు విఫలమైపోయినా ప్రచారంలోకి రాకపోయినా,
దీక్షతో అనేక రంగాల్లో కృషి చేసిన విజ్ఞాని బెల్. కొత్త ఫలితాలకు, కొన్ని ప్రయోగాలు
దారితీయకపోయినా వాటిలో ఇమిడిన భావాల సత్యాసత్యాలు నిరూపించడమే వాటి
ప్రయోజనమవుతుంది. జీవితాంతం ఏవేవో ప్రయోగాలు చేస్తూ, ఫలితాన్నిగాని, పేరు
ప్రఖ్యాతులుగాని పట్టించుకోకుండా 1922 వరకు జీవించిన నిరాడంబర జీవి గ్రాహం
బెల్.
టెలిఫోను తానే నిర్మాత అయినా, బెల్, ఎప్పుడూ ఫోన్ వాడేవాడుకాదుట! దానిలోని
గుడ్డలుకుక్కి మూల పడేసేవాడు. టెలిఫోన్ నిర్మించిన మహానుభావుడెవరో చూద్దామని ఒకావిడ
అనుకొందిట. ఒక టీ పార్టీలో బెల్ను ఆమెకు ఎవరో పరిచయం చేశారు.
ఆయన్ని కలుసుకొన్నందుకు సంతోషిస్తున్నానని అంటూ ఆమె, "మీరు అసలు పుట్టకపోతే ఎంతబావుండునో అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను", అందట నవ్వుతూ,
గ్రాహం బెల్ ఆమె మాటలకు తెల్లబోయాడు. కాస్త కోపం కూడా వచ్చింది. ఆయన ముఖం అ
కేసి చూసి, అది గ్రహించి ఆమె క్షమాపణ చెప్పుకోబోతుంటే, ఆమె మాటలోని అంతరార్థాన్ని
ఆయన గ్రహించి “సరే పాపం! మీపాట్లు చూస్తే జాలేస్తోంది. నేనసలు ఆ పశువును నోరు
విప్పనియ్యను" అన్నాడట.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know