PF అకౌంట్ ఉన్నవాళ్లకి అదిరిపోయే గుడ్ న్యూస్
పిఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్లకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిఎఫ్ వడ్డీ అమౌంట్ అనేది 8.1% చొప్పున వడ్డీ డబ్బులు పీఎఫ్ ఖాతాదారులకు లభిస్తున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ డబ్బులను, EPFO PF అకౌంట్ లో అమౌంట్ ని క్రెడిట్ చేస్తుంది. మీకు కూడా ఎప్పటికీ వడ్డీ డబ్బులు అనేవి వచ్చి ఉండొచ్చు లేదంటే త్వరలో మీ పిఎఫ్ అకౌంట్ లో క్రెడిట్ అయితే అవుతుందన్నమాట.
ఇప్పుడు ఎవరెవరికి ఎంత పిఎఫ్ డబ్బులు వస్తాయో ఇప్పుడు చూద్దాం.
మీ పీఎఫ్ అకౌంట్ లో పది లక్షలు ఉంటే మీకు వడ్డీ రూపంలో 81 వేల రూపాయలు మీకు credit అవుతుంది. అదే విధంగా మీ పిఎఫ్ అకౌంట్ లో ఏడు లక్షలు ఉంటే మీకు 56,700 వరకు లభిస్తాయి ఇంకా పిఎఫ్ ఖాతాలు ఐదు లక్షలు ఉంటే మీకు 40500 రూపాయలు మీకు వడ్డీ అనేది లభిస్తుంది. ఇకపోతే మీ అకౌంట్లో ₹1,00,000 ఉన్నట్లయితే మీకు ఎనిమిది వేల వంద రూపాయలు మీకు వడ్డీ అనేది లభిస్తుంది. ఇలా మీ పిఎఫ్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ ప్రకారంగా మీకు వడ్డీ అనేది లభిస్తుంది.
ఇకపోతే ప్రస్తుతం పీఎఫ్ అకౌంట్ పైన 8.1% వడ్డీ లభిస్తుంది. గత 40 సంవత్సరాలు చూస్తే ఇది అతి తక్కువ రేట్ అని చెప్పుకోవచ్చు కోవిడ్ 19 కారణంగా వడ్డీ రేటు అనేది తగ్గిస్తూ వచ్చింది. మీకు పిఎఫ్ అకౌంట్ లోకి అమౌంట్ వచ్చాయా రాలేదని చెక్ చేసుకోవడానికి సింపుల్ ఈ number కి missed call ఇస్తే చాలు.
01122901406 తర్వాత మీ యొక్క పిఎఫ్ అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉందో మీకు మెసేజ్ వస్తుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know