13. సర్ ఆర్థర్ స్టాన్లీ ఎడ్డింగ్టన్ (బ్రిటన్)
(1882 1944)
రాత్రి వేళ మనం ఆకాశం వంక చూస్తే ఎన్నో నక్షత్రాలు కనిపిస్తాయి. ఆ నక్షత్రాలలో
ఎన్నో రకాలు ఉన్నాయి. కొన్ని కాంతివంతంగా కనిపిస్తాయి. మరికొన్ని కాంతి లేనట్లు కనిపిస్తాయి. సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలు బాగా ప్రతిబింబాలుగా కనిపించవు.ఎంత పెద్ద టెలిస్కోపులు ఉపయోగించి చూసినా బింబాలుగా కనిపించనే కనిపించవు.పరిమాణం లేని చిన్న చిన్న చుక్కల్లాగా కనిపిస్తాయి.
వాటి నుంచి కాంతి వెలువడుతుంది. ఆ కాంతి ద్వారా ఖగోళశాస్త్రజ్ఞలు నక్షత్రాలు రహస్యాలను బట్టబయలు చేస్తున్నారు. ఈ విధంగా నక్షత్రాలలో దాదాపు 30 విశేషాలను కనిపెట్టగలిగారు. అటువంటి వారిలో ఒకరు “సర్ ఆర్థర్ స్టాన్లీ ఎడ్డింగ్టన్”
మాంచెస్టర్ ని 'ఓవెన్స్ కాలేజీలోనూ, కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీలోనూ విద్యనభ్యసించాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రజ్ఞాశాలి అని పేరు తెచ్చుకున్నాడు. మొదటి నుండీ ఖగోళ విజ్ఞానం మీద అభిరుచి చూపించాడు. 1906లో గ్రీనిచ్ గల రాయల్
అబ్జర్వేటరీ (వేదశాల)కి ముఖ్య సహాయకుడిగా నియమితుడయ్యాడు.
1913లో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో ఖగోళ శాస్త్రాచార్య పదవి లభించింది.1914లో అక్కడే ఉన్న అబ్జర్వేటరీకి డైరెక్టరుగా కూడా నియమితుడయ్యాడు.
నక్షత్ర నిర్మాణాల గురించి, ముఖ్యంగా వాటిలోపలి నిర్మాణం గురించి అధ్యయనం చేశాడు. నక్షత్రాల మొత్తం కాంతికి ద్రవ్యరాశిని నిర్ణయించడానికి ఈ సిద్ధాంతం దారి చూపింది.
నక్షత్రం లోపలి గురుత్వాకర్షణ పీడనం బయటి వికరణాన్ని వాయుపీడనాన్ని తప్పక సరితూగేటట్లు చేస్తుందని నిరూపించాడు. శాస్త్రవేత్తలు విశ్వం గురించి రకరకాల సిద్ధాంతాలు చేశారు. దానిలో 'విశ్వం విస్తరిస్తున్నది' అన్న సిద్ధాంతం ఒకటి. అంటే అది వ్యాకోచి దన్న మాట.
విశ్వం నిలకడగా లేదని, అది ఎప్పటికప్పుడు విస్తరిస్తున్నదని గణిత శాస్త్రం ప్రకారం తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ఎడ్డింగ్టన్ కూడా ఉదాహరణలతో నిరూపించాడు. విశ్వం అంతటా వంపు తిరిగి ఉన్నదని, సూర్యుడు, నక్షత్రాల వంటి పెద్ద పెద్ద వస్తువులు సమీపంలో
ఆ వంపును ప్రత్యక్షంగా చూపవచ్చునని ఐన్స్టీన్ చెప్పాడు.
1919 మే 29న సంభవించిన సంపూర్ణ
సూర్యగ్రహణాన్ని ఎడ్డింగ్టన్ పరిశోధన
చేసి ఐన్స్టీన్ చెప్పిన జోస్యాన్ని ఋజువు చేశాడు. ఖగోళ విజ్ఞానంలో ఆయన చేసిన కృషికి తగిన గుర్తింపు లభించింది. 1930లో సర్ బిరుదు,1938లో 'ఆర్థరెమెరిట్' పురస్కారాలను
అందుకున్నాడు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know