సర్ ఆర్థర్ సి. క్లార్క్ గురుంచి

సర్ ఆర్థర్ సి. క్లార్క్
సర్ ఆర్థర్ సి. క్లార్క్ 
(1917)

ఎక్కడో జరుగుతున్న క్రీడలను ఇపుడు మనం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూస్తున్నాం.
దేశ దేశాల్లో వున్న వాళ్లతో ఫోన్లో స్పష్టంగా మాట్లాడగల్గుతున్నాం. ఫాక్స్ ద్వారా సందేశాలు
పంపుకుంటున్నాము. ఇంటర్నెట్ ద్వారా పొందే సౌకర్యాలకైతే అంతమే లేదు.

ఊహలనేవి లేకపోతే శాస్త్రం ముందుకి వెళ్ళలేదు. శాస్త్ర రంగంలో జరగబోయే ఎన్నో పరిణామాలను ముందుగానే ఊహించి సైంటిస్ట్లకే స్ఫూర్తిగా నిలిచిన వారిలో ఆర్ధర్ చార్లెస్ క్లార్క్ అగ్రగామి.

భూమి చుట్టూ నిర్దిష్ట కక్ష్యలో పయనించే శాటిలైటికి కొంత వేగం వుంటుంది. ఈ వేగాలు వేర్వేరుగా ఉండడం వల్ల శాటిలైట్ ప్రసారం చేసే సంకేతాలు దాన్ని ప్రయోగించిన దేశానికి అందుబాటులో వుండవు..

అలా అందాలంటే భూమి తన చుట్టు తాను తిరుగుతూ వున్నప్పటికీ శాటిలైట్ ఆ
దేశానికి కొంత ఎత్తులో స్థిరంగా వుండాలి. శాటిలైట్ కక్ష్యలో తిరిగే వేగం, భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఒకటైతే ఆ రెండూ ఒకదానికొకటి స్థిరంగా వున్నట్టుంటాయి.

ఇటువంటి శాటిలైట్ని Geo synchronous communication satellite అంటారు.

ఈ శాటిలైట్ని శాస్త్రజ్ఞులు కక్ష్యలో ప్రవేశ పెట్టక ముందే, అది భవిష్యత్తులో నిర్వహించే
పాత్రను వారి కంటే 20 ఏళ్లకు ముందే ఆర్ధర్ సి. క్లార్క్ ఊహించాడు. భూమి నుండి 42,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే Geo stationary కక్ష్యను clark orbit అంటారు.

భవిష్యత్తును ఖచ్చితంగా ఊహించటానికి తర్కం చాలా అవసరం. కానీ తర్కానికి మించి నమ్మకం ఊహించే విధానం ఎంతో అవసరం. వయోవృద్ధుడు, జ్ఞాన వృద్ధుడు అయిన ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు ఒక విషయం ఇలా జరగటానికి వీలుందని నిర్ధారిస్తే అతను చెప్పింది చాలా వరకు ఒప్పుగా వుంటుంది. కానీ ఒక విషయం ఇలా జరగటానికి ఏ మాత్రం వీలులేదంటే బహుశా అతను చెప్పేది తప్పుగా కావచ్చు.
మనవాళ్ళు అనుభవిస్తున్న విషాదాల్లో ఒకటి నీతి నియమాలను మతం హైజాక్ చేయటం. అందువల్ల మతానికి, నీతి నియమాలకు విడదీయరాని బంధం వుందని మనమంతా అనుకుంటాం. నిజానికి నీతికి మతంతో ప్రమేయం లేదు. ముఖ్యంగా జ్యోతిష్యులు
తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే నక్షత్రాలు మానవుల విధులు (తలరాతలు) నియంత్రించటం పోయి, మానవులు నక్షత్రాల విధులను నియంత్రించే కాలం వస్తుందని.

సైన్స్ ఫిక్షన్ రచయితలు ప్రెడిక్ట్ చెయ్యటానికి ప్రయత్నించారు. నిజానికి వారు దానికి
విరుద్దంగా భవిష్యత్తుని నియంత్రించటానికి ప్రయత్నిస్తారు. మనకు శాస్త్రం అందిస్తున్న
కొత్త ఇన్ఫర్మేషన్ విజ్ఞానం కాదు. విజ్ఞానం, వివేకం అంతకన్నా కాదు. అయితే వీటికన్నిటికి
ఇన్ఫర్మేషన్ తొలిమెట్టు. శాస్త్రరంగంలో జరగబోయే సంఘటనల్ని క్లార్క్ ముందుగానే ఊహించి
చెప్పిన కొన్నింటిని చూద్దాం.....

భవిష్యత్తులో జీవశాస్త్రంలో DNA పరిశోధనలోని మెలకువల్లో పెద్ద మార్పు లొస్తాయి.కానీ అనంతమైన శక్తిని ఉత్పాదించే క్వాంటమ్ సిద్ధాంత ప్రయోగాలపైనే నాకు శ్రద్ధ. మార్స్ గ్రహంపై ప్రాణకోటి ఉందనటంతో ఆయనకు పూర్తి నమ్మకం ఉంది.

చంద్ర మండలంపై ఇతర గ్రహాలపై కాలనీలు ఏర్పరచవచ్చు. మొదటి రోదసీ నౌకను
చూడటానికి మనం అత్యంత దగ్గరలో ఉన్నాము. రానున్న భవిష్యత్తులో 2004లో మొట్ట
మెదటి హ్యూమన్ క్లోన్, 2005లో నాసా మార్స్ సర్వేయర్ను ప్రయోగించటం, 2006లో
ఆఖరి బొగ్గుగని మూసివేత, 2009లో తృతీయ ప్రపంచం దేశాల్లోని ఒక పట్టణంలో అణు
బాంబు ప్రమాదవశాత్తు పేలటం వల్ల విధ్వంసం.

ఐక్యరాజ్య సమితిలో ఒక చిన్న సమావేశం తర్వాత ప్రపంచంలోని అన్ని అణ్వస్త్రాలను ధ్వంసం చేయటానికి నిర్ణయం. 2010 ఫస్టు క్వాంటమ్ జనరేటర్స్ రోదసీలోని శక్తితో నిర్మించటం, వాటి వల్ల నిరంతరం విద్యుదుత్పాదన, 2015లో ద్రవాన్ని పరమాణు స్థాయిలో నియంత్రించే క్వాంటమ్ జనరేటర్ ఆవిష్కరణ, కొన్ని సంవత్సరాల్లో సీసం, రాగి, ఉపయోగం ఎక్కువై వాటి ధర బంగారం కన్నా రెట్టింపు అవుతుంది.

2016 నాటికి చలామణిలో వున్న కరెన్సీ అంతా రద్దవుతుంది. ఎక్చేంజ్కి mega watt hour ప్రమాణమవుతుంది. 2017 డిసెంబర్, 16 న తన 100వ యేట Sir Arthur C.Clarke, Hilton orbitor లో మొట్ట మొదటి అతిధిగా వెళతారు. 2020 Artificial intellegence మానవ మేధస్సుతో సమానమవుతుంది. 2021 మార్స్ గ్రహంపై మానవుడు కాలు మోపటం, 2023 కంప్యూటర్ నుండి ఉత్పన్నమైన DNA నుండి డైనోసార్ శిధిలావశేషాలు' క్లోనింగ్ చేయటం, 2057 అక్టోబర్ 4న రోదసీ యుగానికి వందేళ్లు.భూమిపైన కాకుండా, చంద్రుడు, అంగారక గ్రహంపైనే కాకుండా వీనస్, నెప్ట్యూన్, ప్లూటో కక్ష్యల్లో కూడా జరుపుకుంటారు. 2095 కాంతి వేగానికి అతి చేరువలో ఉండే వేగంతో పయనించే రాకెట్ల ఉత్పాదన 2100 వ సం॥ చరిత్ర మళ్లీ మొదలవుతుంది.

Post a Comment

If you have any doubts, please let me know