అలెగ్జాండర్ ఫ్లెమింగ్ (స్కాట్లాండ్)గురుంచి

అలెగ్జాండర్ ఫ్లెమింగ్ (స్కాట్లాండ్)
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ (స్కాట్లాండ్)
(1881-1955)

ఒక్కోసారి మన శరీరానికి గాయాలు అవుతుంటాయి. వీటిని మాన్పక పోతే ప్రమాదం
జరుగుతుంది. కంటికి కనిపించని సూక్ష్మ జీవులు ఆ గాయాల ద్వారా శరీరంలోని రక్తంలోకి ప్రవేశిస్తాయి. రక్తాన్ని విషపూరితం చేస్తాయి. అటువంటప్పుడు ప్రాణాలకే అపాయం జరగవచ్చు.

డిప్తీరియా, న్యూమోనియా లాంటి జ్వరాలు వస్తాయి. గాయాలకు విషక్రిములు పెరగకుండా మందు రాస్తారు. జ్వరాలకు ఇంజెక్షను ద్వారా మందు ఎక్కిస్తారు. పైన రాసే మందును, లోపలికి ఎక్కించే మందును 'పెన్సిలిన్' అంటారు. ఇది సూక్ష్మజీవులను నాశనం చేసే మందు.
ఈ మందు "పెనిసివియన్నా టేటమ్" నుండి లభిస్తుంది. దీని ఉనికిని కనుగొని మానవాళికి మేలు చేసిన శాస్త్రవేత్త సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఫ్లెమింగ్ ఏడో ఏట తండ్రి మరణించాడు. తరువాత తల్లి సంరక్షణలోపెరిగాడు. లాడూస్ మూర్ పాఠశాలలోను, డ్రావెల్ పాఠశాలలోను విద్యాభ్యాసం కావించాడు. 12 ఏళ్ళకు కల్మన్రాక్ అకాడెమీలో చేరాడు.

కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేక బడి మానేసి ఓడల కంపెనీలో పనికి చేరాడు.1901లో దూరపు వారసత్వం కలసి వచ్చి ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకున్నది.

దాంతో ఫ్లెమింగ్ సెంట్మేరి మెడికల్ పాఠశాలలో చేరి వైద్యం శాస్త్రం అభ్యసించాడు.ఫెజియాలజీ, ఫార్మకాలజీ, పాథలాజీలలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. 1906లో డాక్టర్ డిగ్రీ తీసుకున్నాడు. ఆయనకు ఉపాధ్యాయుడుగా ఉన్న ఆయిత్రెట్ దగ్గర చేరి వైద్య విషయాలలో పరిశోధన ప్రారంభించాడు.

అతడు పరిశోధనలను ప్రారంభించేనాటికి జెన్నర్, పాశ్చర్, కాక్, పాలెర్లిబ్ మొదలైన 
వారు సూక్ష్మజీవులను గురించి ఎన్నో విషయాలను తెలియచేసారు. కొందరు వైద్యులు “రసాయనిక సంక్రమణ నిరోధినుల వాడకాన్ని (యాంటిసెప్టిక్స్) ప్రోత్సాహించారు.

ఫ్లెమింగ్ ఈ పద్ధతిని వ్యతిరేకించాడు. కొన్ని
సూక్ష్మజీవులు కొన్ని స్రావాలను తయారుచేస్తాయి. ఆ స్రావాలు మరికొన్ని సూక్ష్మజీవులను చంపడానికి పనికి వస్తాయి. అటువంటి స్రావాన్ని
"యాంటిబయాటిక్”అంటారు. అటువంటి ఆంటీ బయాటిక్స్ను కనుగొనడానికి అతడు పరిశోధనలు చేశాడు.
సూక్ష్మజీవులకు సంబంధించిన "లైజోజైమ్" గురించి ఒక పత్రం రాశాడు. ఆ పత్రాన్ని 1922 ఫిబ్రవరి 13న రాయల్ సొసైటీకి సమర్పించాడు. 1928లో అతడికి ఖ్యాతి తెచ్చి పెట్టిన "పెన్సిలియం ను కనిపెట్టాడు. అతడు "స్టెపిలోకాకస్" అనే సూక్ష్మజీవులను పెంచుతున్నాడు. ఇవి గాయాల ద్వారా రక్తంలోకి ప్రవేశించి రక్తాన్ని విషంగా మారుస్తాయి.

ఈ జీవులను పెంచి పళ్ళెంలో ద్రావణం మధ్య “బూజు” బయలుదేరటం గమనించాడు. ఆ బూజు కొన్ని సుక్ష్మజీవులను నాశనం చేసింది. దీనినే “పెన్సిలియం” అన్నాడు. దీనికిగాను 1945లో నోబెల్ బహుమానాన్ని హోవే, చైన్ అనే వారితో పాటు అందుకున్నాడు. 1944లో బ్రిటన్ రాజు "సర్" బిరుదును ఇచ్చి సత్కరించాడు.

Post a Comment

If you have any doubts, please let me know