ఆర్యభట్టు (ఇండియా )

ఆర్యభట్టు గురుంచి 
 ఆర్యభట్టు (ఇండియా)
క్రీస్తుశకం 499 మార్చి 21 మధ్యాహ్నం 12 గం॥లకు కుసుమపురం (పాట్నా)
సమీపంలోని నలందా విశ్వ విద్యాలయంలో ఓ నూతన అధ్యాయానికి శ్రీకారోత్సవం
జరుగుతోంది.

23 సంవత్సరాల యువకుడు వేదిక పైకి ఎక్కి, సూర్యుడిని తదేకంగా చూసి, అక్కడ
గల ఓ గ్రంధంపై కలంతో తొలి అక్షరాన్ని రాశాడు. అక్కడ చేరిన ఆహుతులంతా ఆనందంతో
పూలవర్షం కురిపించారు. ఆ యువకుడే ఆర్యభట్టు. అతడు శ్రీకారం చుట్టి రాసిన గ్రంధమే
“ఆర్యభట్టీయము”.

ఖగోళ రహస్యాలను విప్పిచెప్పే ఈ గ్రంధంలోని సూత్రాలు ఇప్పటికీ ఆమోదయోగ్యాలే.
476వ సంవత్సరంలో కేరళలో జన్మించిన ఆర్యభట్టారకుడు నలందలో శాస్త్రాభ్యాసం చేశాడు.
అతడి గ్రంధరచనకు ముగ్ధుడైన గుప్త చక్రవర్తి, బుద్ధ గుప్తుడు విశ్వ విద్యాలయానికే అతడిని
ఆచార్యుని చేశాడు.

భూమి గుండ్రంగా ఉందని, తన చుట్టూ తాను తిరగటం వల్లనే దివారాత్రులు ఏర్పడుతున్నామని ఆర్యభట్టాచార్యుడు స్పష్టం చేశాడు.
చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదని, సూర్యకాంతి వల్లనే వెలుగుతున్నాడని చాటాడు.
భూచంద్రుల ఛాయలే గ్రహణాలకు కారణమని శాస్త్రీయంగా నిరూపించాడు. గణితంలో
సైతం ఆర్యభట్టారకుడు అగ్రగణ్యుడే. పై విలువను అతడు 3.1416గా చూచాయగా చెప్పాడు.
గణిత శాస్త్రంలోని సైన్ పట్టికలకు అతడే ఆద్యుడు. అతడు సూత్రీకరించిన Ax by = c' అనే ఈక్వేషన్కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది.

అతిపెద్ద సంఖ్యలను రాయటం, పలకటానికి పద్ధతులు కనిపెట్టాడు. ఆర్యభట్ట సిద్ధాంతం
పేరిట అతడు రాసిన మరో గ్రంధమే ఇప్పటి పంచాంగాలకు ఆలంబన, అతడు చూపిన
విజ్ఞాన పధానికి చిహ్నంగానే భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట
పేరు పెట్టాడు.

Post a Comment

If you have any doubts, please let me know