డా॥ అవతార్ సింగ్ పైంటల్ (ఇండియా)గురుంచి

డా॥ అవతార్ సింగ్ పైంటల్ (ఇండియా)



డా॥ అవతార్ సింగ్ పైంటల్ (ఇండియా)

1981లో రాయల్ సొసైటీ సభ్యుడైన తొలిభారతీయ వైద్యశాస్త్రజ్ఞుడు ఈయన.
బర్మాలోని మొగల్లో పుట్టిన పైంటల్, డాక్టరైన తండ్రి వెంట ఉంటూ క్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా గమనిస్తూండేవాడు. అలా జీవశాస్త్రంపై ఆసక్తి పెంచుకున్న పైంటల్, లక్నో వైద్యకళాశాలలో చేరి, చురుకైన విద్యార్థిగా పేరుతెచ్చుకున్నారు. 1950లో స్కాలర్షిప్పై బ్రిటన్ వెళ్ళి పి.హెచ్.డి. సాధించారు. ఆ సమయంలో ఆయన చేసిన ప్రయోగం అక్కడి
వైద్య శాస్త్రజ్ఞులను సైతం నివ్వెరపరిచింది.

మనిషి అధికంగా శ్రమపడితే ఊపిరితిత్తుల స్థంభన జరిగి చనిపోయే ప్రమాదం కూడా ఉన్న నేపధ్యంలో లంగ్స్ చివర్లో వుండే సూక్ష్మ నరాలలోని 'జక్స్ టాపల్ మనోరీ కేపిలరీ రిసెప్టర్స్'(జె-రిసెప్టర్స్) మెదడుకు సంకేతాలు పంపిస్తాయని అలాగే పొట్టలో వుండే
'గ్యాస్ట్రో ఇన్డెస్టినల్ స్ట్రెచ్ రిసెప్టర్స్' వల్ల కడుపు నిండిపోయినట్లు అర్థమవుతుందని
- డా॥అవతార్సింగ్ పైంటల్ కనిపెట్టారు.

హృదయంలో వుండే వాల్యూమ్ రిసెస్టర్స్ ఉనికిని కనిపెట్టి అవి శరీరంలో ద్రవాల పరిమాణాన్ని నియంత్రిస్తాయని చాటారు. 1954లో తిరిగి వచ్చి, ఢిల్లీలో వల్లభాయ్పటేల్“చెస్ట్ ఇన్స్టిట్యూట్లో చేరారు.
 ఊపిరి సమస్యలు, కడుపులో అల్సర్లు గల రోగులకు వైద్య సేవలు అందించడంలో ఫైటర్ పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

Post a Comment

If you have any doubts, please let me know