బెర్జీలియస్ జోన్స్ జాకబ్ గురుంచి

బెర్జీలియస్ జోన్స్ జాకబ్
బెర్జీలియస్ జోన్స్ జాకబ్
(1779-1848)
ప్రాచీన గ్రీకు, ఈజిప్టు శాస్త్రవేత్తలు కొన్ని మూలకాల ధర్మాలను పరిశీలించారు. వాటికి, రక రకాల పేర్లు పెట్టారు. అలా పేర్లు పెట్టటం ఒక క్రమ పద్ధతిలో లేదు. ఇనుముని,డాలుపైన బల్లెం వున్న గుర్తుతో సూచించారు. అలాగే పాదరసానికి 35 మాటలు, 20
గుర్తులు ఉండేవి. ఇలా వుండటం వల్ల దేనిని వాడాలో తెలియక, తరువాత శాస్త్రవేత్తలు
తికమక పడ్డారు.

అందుకని దానికొక నియమావళి వుండాలి, చిన్న చిన్న పేర్లు పెట్టాలి అని ఆలోచించి నేడు అందరూ వాడుతున్న గుర్తులను కొన్నింటిని రూపకల్పన చేశాడు బెర్జీలియస్.

అతడి పూర్తి పేరు జోన్స్ జాకబ్ బెర్జీలియస్. చిన్నతనం లోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాధయ్యాడు. బంధువుల ప్రాపకంలో పెరిగాడు. వైద్య శాస్త్రం మీద అభిమానంతో 'ఉప్పసలా' విశ్వ విద్యాలయంలో 1802 లో డిగ్రీ తీసుకున్నాడు. రసాయన శాస్త్రం వైపు ఆకర్షించబడి దానిని చదవటం, ప్రయోగాలు చేయటం ప్రారంభించాడు.

1807 నుంచి స్టాక్ హోమ్లోని విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పని చేశాడు.1808లో స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో సభ్యుడయ్యాడు. విద్యుత్ని ఉపయోగించుకుని కొన్ని మూలకాలను విడగొట్టాడు. అవి దాదాపు రెండు వేలు వుంటాయని అంచనా వేశాడు.ఇరవై ఎనిమిది మూలకాలను పరమాణు భారాన్ని నిర్ణయించాడు. వాటిల్లో దోషాలను గమనించి వాటిని బయట పెట్టాడు.

'ఉష్ణోగ్రత' పీడనాలు సమానంగా ఉన్నప్పుడు ఘనపరిమాణం వున్న వాయువుల్లో
పరమాణువులు సమాన సంఖ్యలో వుంటాయని ప్రతిపాదించాడు. మూలకాలైన ధోరియం,
సీలియం, సెలీనియంలను కనిపెట్టాడు. అతడి ప్రయోగాలు, పరిశోధనలకు స్వీడన్ చక్రవర్తి
14వ చార్లెస్ అండదండలు లభించాయి. అందువల్ల ఎంతో కృషి చేయగలిగాడు.
మూలకాల గురించి పరిశోధన చేసేటప్పుడు పూర్వులు పెట్టిన పేర్లు ఎంతో చికాకుని
కలిగించాయి. అందుకని వాటికొక నియమావళి ఉండాలని ఆలోచించాడు. మూలకం ఇంగ్లీషు పేరులోని మొదటి అక్షరాన్ని దానికి గుర్తుగా ఏర్పరిచాడు. ఉదాహరణకు కార్బన్
ఉందనుకోండి.

దీనిలోని మొదటి అక్షరాన్ని అంటే 'C'ని దానికి గుర్తుగా సూచించాడు. ఇంకొక మూలకానికి C మొదటి అక్షరంగా వుంటే పక్కన వున్న అక్షరాన్ని చిన్నదిగా వ్రాసి చూపించాలన్నాడు.

వెండి, సీసం, ఇనుము లాంటి వాటికి లాటిన్ పేరులోని మొదటి అక్షరాలను గుర్తులుగా
ఏర్పరిచాడు. ఇలా అతను వైజ్ఞానిక అన్వేషణ తన జీవితాశయంగా నిర్ణయించుకున్నాడు. తన ఇంటిని పెద్ద ప్రయోగశాలగా మార్చుకున్నాడు. ఎన్నో విశేషాలు కనిపెట్టి తన పేరు
నిలుపుకున్నాడు.

Post a Comment

If you have any doubts, please let me know