యూట్యూబ్ లో యాడ్స్ వల్ల మనీ వస్తుందా యూట్యూబ్లో వ్యూస్ వల్ల మనీ వస్తుందా?
ఎంతోమంది యూట్యూబ్ ని కెరీర్ గా తీసుకుంటున్నారు.
యూట్యూబ్లో లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ ని కెరీర్ గా తీసుకొని జాబులు మానేసి యూట్యూబ్లో సెటిల్ అయిన వాళ్లు కూడా ఉన్నారు.
ఎంతోమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్, ఇతర ఉద్యోగాలు చేస్తూ కూడా యూట్యూబ్ ని కెరీర్గా తీసుకొని సెటిల్ అయిన వాళ్లు ఉన్నారు.
యూట్యూబ్ లో వ్యూస్ వల్ల మనీ రావు యూట్యూబ్ లో యాడ్స్ వల్ల మనీ వస్తుంది. మీ యొక్క వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు, మీ యొక్క వీడియోని జనాలు వీక్షించినప్పుడు అందులో యాడ్స్ ప్లే అవుతాయి.ఆ యాడ్స్ వల్ల మీకు డబ్బులు వస్తాయి.
మీ యొక్క యూట్యూబ్ వీడియోకి వ్యూస్ ఎక్కువగా ఉంటే, ఆటోమేటిక్గా మీ యొక్క వీడియోకి యాడ్స్ కూడా ఎక్కువగా ప్లే అవుతాయి తద్వారా మీకు అమౌంట్ అనేది ఎక్కువగా వస్తుంది.
మీ యొక్క యూట్యూబ్ వీడియో మినిమం పది నిమిషాలు ఉండే విధంగా చూసుకున్నట్లయితే మీకు వీడియోస్ లో ఎక్కువ యాడ్స్ ప్లే అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎంత ఎక్కువ మంది మీ యొక్క యూట్యూబ్ వీడియోని వీక్షించినట్లయితే మీకు ఈ యాడ్స అనేది ఎక్కువగా ప్లే అవుతాయి తద్వారా ఎక్కువ డబ్బుల్ని మీరు సంపాదించుకోవచ్చు.
కానీ మీరు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకున్నట్లయితే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కి 1000 subscribers అండ్ 4000 watch hours ఉండాలి. 1000 సబ్స్క్రైబర్స్ మరియు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క యూట్యూబ్ ఛానల్ monetisation అవుతుంది. ఒకసారి మీ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత యూట్యూబ్ ద్వారా మీకు money అనేది జనరేట్ అవుతుంది.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే, నా వెబ్సైట్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.యూట్యూకి సంబంధించిన ఎటువంటి డౌట్ అయినా మీరు ఈ వెబ్సైట్లో అడగవచ్చు నేను మీకు తప్పకుండ సమాధానం ఇస్తాను.
ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know