ఆల్ ఫ్రెడ్ నోబెల్ (స్వీడన్) గురుంచి

ఆల్ ఫ్రెడ్ నోబెల్ (స్వీడన్)
ఆల్ ఫ్రెడ్ నోబెల్ (స్వీడన్)
నోబెల్ బహుమతులను ప్రకటించటం మనకు తెలిసిందే.... ఆ నోబెల్ ప్రైజ్ గురించిన
విశేషాలను మనమిప్పుడు తెలుసుకుందాం. డా.ఆల్ఫ్రెడ్ నోబెల్ స్వీడన్ దేశానికి చెందిన
శాస్త్రవేత్త. ఈయన పూర్తి పేరు డా.ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్.

ఈయన స్టాక్ హోంలో 1833 అక్టోబర్ 21న జన్మించారు. ఈయన ఆదర్శవాది.ఈయన ప్రపంచ శాస్త్రవేత్తలలో గొప్ప శాస్త్రవేత్త. తన ఆస్తి మొత్తాన్ని ధారపోసి డైనమైట్,
జిలిటిన్ స్టిక్స్ను కనుగొన్నాడు. అయితే డైనమైట్ ప్రపంచ వినాశానికి దారితీసే అతి భయంకర
పేలుడు పదార్థం. దీనివల్ల యుద్ధాలు ఆగిపోతాయని, ప్రపంచ శాంతి ఏర్పడుతుందని ఈ
శాస్త్రజ్ఞులు భయంకర పదార్థాల వల్ల భయపడతారని ఆయన భావించాడు.
డైనమైట్కు మొదట 1867లో అమెరికా,
ఇంగ్లాండ్ దేశాలలో పేటెంట్ హక్కులు లభించాయి.
డైనమైట్, ప్రపంచ దేశాలలో అమ్ముడయిపోయి ఎంతో ద్రవ్యం లభించింది. ఈ ద్రవ్యంతో నోబెల్ ప్రైజ్న ఇవ్వడానికి నిర్ణయించాడు.

1895 ఆల్ఫ్రెడ్ నోబెల్ తన వీలునామాపై
సంతకం చేశాడు. 1,750,000 పౌండ్లను స్వీడన్, నార్వే
ట్రస్టుల అధీనంలో ఉంచాడు. ప్రతి సంవత్సరం వచ్చే
వడ్డీని ఏటా అయిదు భాగాలుగా చేసి మానవ జాతికి గొప్ప సేవ చేసిన వారికి ఆ మొత్తాన్ని బహుమతిగా ఇవ్వడం ఆరంభించారు.. ఈ బహుమతులను భౌతిక, రసాయన, వైద్య,సాహిత్య, ఆర్థిక,శాంతి రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఇస్తారు. అయితే 1901 నుంచి నోబెల్ శాంతి
బహుమతి ఇవ్వడం మొదలయింది.


Post a Comment

If you have any doubts, please let me know