అబ్దుల్ కలాం గురుంచి

అబ్దుల్ కలాం
అబ్దుల్ కలాం (ఇండియా)

అతి సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తులు కూడా అత్యంత గొప్ప స్థాయికి చేరుకుంటూ ఉంటారు. అసలు శాస్త్ర పరిశోధన అంటేనే తెలియని కుటుంబంలో పుట్టిగా శాస్త్రీయ రంగంలో ఉన్నత స్థానాల్ని అధిరోహించిన ప్రజ్ఞాశాలి అబ్దుల్ కలాం.
కష్టపడి పని చేస్తే సాధారణ మేధస్సు ఉన్న వ్యక్తి కూడా అత్యున్నత స్థానాలను పొందవచ్చని, కృషిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని అబ్దుల్ కలాం రుజువు చేశారు.

జీవితంలో విజయం సాధించాలంటే సంపన్న కుటుంబం నుంచే రానవసరం లేదని ప్రపంచానికి
తెలియచేసి విజయకేతనం ఎగురవేశారు.
అతి నిరుపేద కుటుంబంలో పుట్టిన కలాం
స్వయంకృషితో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు.
1954లో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో
ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో చేరారు కలాం.
అప్పట్లో క్లాస్ లో average స్టూడెంట్ గా ఉండేవారు. సబ్జెక్టులు అంత త్వరగా అర్ధం అయ్యేవి కావు. అయినా పట్టుదలతో ఆయన శ్రమించారు.

కోర్సు పూర్తయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం
బెంగుళూరులోని ఏరోనాటిక్స్ (H.ALL)లో చేరారు.
ట్రైనింగ్ తర్వాత D.T.D.P. (Air)లో జూనియర్
ఇంజనీర్గా చేరారు. పవన విద్యుత్ని ఉత్పత్తి చేయటానికి వీలుగా విండ్ మీల్స్ డిజైన్ రూపొందించే విభాగంలో ఉండేవారు. గాలివల్ల రోటర్కు బ్లేడ్స్ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రోటర్ ను ఎలక్ట్రిక్ టర్బైను అనుసంధానిస్తున్నారు. ఈ టర్పైన్ తిరగటం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అప్పట్లో కలాం ఈ రోటర్ని వాటర్ పంపుకు అనుసంధానించారు. బావిలోని నీటిని
స్టోరేజ్ ట్యాంక్లోకి పంపటానికి ఇది ఉపయోగపడేది.
-ఆ ప్రాజెక్టు విజయవంతమైంది. దాన్ని ఢిల్లీలో కూడా ప్రదర్శించారు. ఆ తర్వాత డకోటా ఎయిర్ క్రాఫ్ట్కు అమర్చటానికి టార్గెట్లను తయారుచేసే ప్రాజెక్టుని అబ్దుల్ కలాం ప్రారంభించారు.

ఈ టార్గెట్లను యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్తో ఛేదిస్తారు. ఈ టార్గెట్లను కాంపోజిట్మెటీరియల్స్ ఉపయోగించి రూపొందించటం జరిగింది. అప్పటికాలంలో అదొక వినూతన ప్రయోగంగా గుజరాత్లోని జామ్నగర్లో వీటిని విజయవంతంగా పరీక్షించారు. ఈ రెండు
ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన కలాం రక్షణశాఖకు చెందిన బెంగుళూరులోని 
ఎరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్కి మారిపోయారు.
అక్కడ కలాంక్ గ్రౌండ్ ఎఫెక్ట్ మిషన్స్ను తయారు చేసే బాధ్యత అప్పగించారు. వీటినే యిప్పుడు హోవర్ క్రాఫ్ట్లు అని పిలుస్తున్నారు. ఇవి నేల మీదా, సముద్రంలో కూడా ప్రయాణించగలవు. వీటిని తీర ప్రాంతాల్లో సైనికులను తరలించటానికి ఉపయోగిస్తుంటారు. అబ్దుల్ కలాం దీని నమూనాను తయారు చేశారు. అప్పట్లో వి.కె.కృష్ణమీనన్ 
రక్షణమంత్రిగా ఉండేవారు. ఈ ప్రొటో టైపు మీనన్ పరీక్షించారు. అదే సమయంలో ప్రముఖశాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ తుంబ ఈక్వోటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్
(దీనికే తర్వాత ఇస్రో గా పేరు మార్చారు)లో పని చేయటానికి శాస్త్రవేత్తల కోసం వెతకటం సంతో
ప్రారంభించారు. కలాం పని తీరుని చూసి ఆకర్షితుడైన ఆయన వెంటనే అతనిని తన యద
సంస్థలోకి తీసుకున్నారు.

రీ ఇన్ఫోర్స్ ప్లాస్టిక్స్ డివిజన్ బాధ్యతలను అప్పగించారు. రీ ఇన్ ఫోర్స్ ప్లాస్టిక్స్
ప్రత్యేకత ఏమిటంటే వాటి బరువు తక్కువ, బలం ఎక్కువ. అంతరిక్ష ప్రయోగాలకు ఇవి టెలి
బాగా పనికి వస్తాయి. వీటిని రాకెట్ మోటార్ యింజన్స్, కంట్రోల్ ఫిన్స్, నాజిల్స్ మొదలైనవి అది
తయారు చేయాటానికి ఉపయోగిస్తారు.

ఈ రంగంలో కలాం కంట్రిబ్యూషన్ - ఫిలమెంట్ వైండింగ్ మిషన్, దీని ద్వారా నా,
రాకెట్ మోటారులకు అవసరమైన ట్యూబ్స్ని తయారు చేయటానికి వీలుంటుంది. ఆ తర్వాత 
కలాం S.L.V.. 3 (శాటిలైట్ లాంచింగ్ వెహికిల్)కి ప్రాజెక్టు డైరెక్టర్ అయ్యారు. 
S.L.V. - 3 పరీక్ష విఫలమైంది. అది ఎందుకు విఫలమైందో విశ్లేషించి చెప్పటంలో కలాం.
విజయం సాధించారు.
- నిపుణులతోను, విద్యాసంస్థల మేధావులతోను విస్తృతంగా చర్చలు జరిపి అసలు
కారణాన్ని కనుగొనగలిగారు. ఆ తర్వాత కలాం రెండుసార్లు S.L.V - 3 ను విజయవంతంగా తండ్రి
పరీక్షించారు.

ఆ తర్వాత కలాం హైదరాబాద్లోని D.R.D.L.. కి డైరెక్టరుగా వచ్చారు. ఆ
సమయంలోనే అగ్ని, త్రిశూల్, పృధ్వీ, ఆకాష్, నాగ్ మొదలైన క్షిపణుల రూపకల్పనలో
| కలాం ప్రముఖ పాత్ర వహించారు. తనదైన శైలిలో ప్రతి ఒక్కరిని మెప్పించి, ఒప్పించగల
| కలాం సమర్ధవంతమైన టీమ్ని తయారు చేసి ఎన్నో మంచి ఫలితాలు సాధించగలిగారు.

సామాన్య కుటుంబంలో జన్మించినా పట్టుదలతో శాస్త్రజ్ఞుడిగా సైంటిఫిక్ ప్రెసిడెంట్
భారతదేశానికి వన్నె తెచ్చిన అబ్దుల్కలాం మన దేశ రాష్ట్రపతిగా అత్యున్నత పదవికి చేరుకొని
నేటి యువతకి ఎంతో ఆదర్శప్రాయులుగా నిలిచారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా
లక్ష్యసాధన దిశగా పయనించి లక్ష్యాన్ని ఛేదించటంలోనే అసలైన ఆనందం ఉంటుందని..
. ఆయన యువతకు స్ఫూర్తినిస్తున్నారు.

Post a Comment

If you have any doubts, please let me know