చేయాలి, రావాలి,ఉండాలి, వెళ్లాలి. అటువంటి sentences ను english లో చెప్పాలనుకుంటున్నప్పుడు Have to / has to ని ఉపయోగిస్తారు.
ఇక్కడికి రావాలి
పాట పాడాలి
ఇంగ్లీషు నేర్చుకోవాలి
స్కూల్ కి వెళ్ళాలి
ఇటువంటి పనులను చేయవలసి ఉన్న పనులు అంటారు. ఇటువంటి పనులకు have to/has to helping verb కు ఉపయోగించాలి.
I
We Have to
You
They
He
She Has to
It
Subject+have to /has to +verb 1+ extra words
Positive :
Examples :
నేను వెళ్ళాలి.
I have to go
You have to change your attitude.
నువ్వు నీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి.
We have to study well.
మనం బాగా చదవాలి.
Where do you have to go now?
నువ్వు ఇప్పుడు ఎక్కడకు వెళ్ళాలి?
I've to send a mail.
నేనొక మెయిల్ పంపాలి.
You have to eat.
నువ్వు తినాలి.
I have to write exam today
నేను ఈ రోజు పరీక్ష రాయాలి.
They have to understand
వాళ్ళు అర్ధం చేసుకోవాలి.
You have to think.
నువ్వు ఆలోచించాలి.
I have to write a record.
నేను ఒక రికార్డ్ వ్రాయాలి.
She has to wash my cloths.
ఆమె నా బట్టలు ఉతకాలి.
Negatives :
Don't have to/ need not
(చేయవలసిన అవసరం లేని పనులు)
నేను అక్కడికి వెళ్లాలి (positive)
I have to go there.
నేను అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు.
I don't have to/need not go there (negative )
ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళవలసిన అవసరం లేదు.
I don't have to go to duty today
నీవు ఇక్కడికి రానవసరం లేదు
You don't have to come here
నువ్వు నాకు ఏమీ చెప్పనవసరం లేదు.
You don't have to say anything to me
నీ సహాయం కోరవలసిన అవసరం నాకు లేదు.
I don't have to seek your help
నీ మీద ఆధార పడవలసిన అవసరం నాకు లేదు
I don't have to depend on/upon you.
నేను ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు.
I don't have to go anywhere.
నీ అనుమతి కోరవలసిన అవసరం నాకు లేదు
I don't have to take your permission.
నీ నుండి నీతులు నేర్చుకోవలసిన అవసరం నాకు లేదు
I don't have to learn morals from you.
Have to make:
నేను వాళ్లకి నేర్పించాలి, అటువంటి వాటికి Have to make or has to make ని ఉపయోగించాలి.
I
We
You have to make
They
He
She has to make
It
నేను చూడాలి
I have to see. (Have to)
నేను వాళ్లకి చూపించాలి. (Have to make)
I have to make them see.
నేను నా చుట్టాలకు కైలాసగిరి చూపించాలి.
I have to make my relatives show Kailasagiri.
మేము మా శ్రోతలకు మంచి పాటలు వినిపించాలి.
We have to make our listeners listen to melody songs.
నీవు మా ఫంక్షన్ లో మంచి పాటలు పాడించాలి.
You have to make them sing melody songs in our function.
వారు వారి పిల్లలను ఆడించాలి.
They have to make their children play.
ఆమె తన పిల్లలకు తినిపించాలి.
She has to make her children eat.
అతడు తన విద్యార్థులచే పరీక్షలు బాగా వ్రాయంచాలి.
He has to make his students write the examinations well.
ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉదయాన్నే లేపి చదివించాలి.
Every one has to make their children getup early morning and read.
మనము మన పిల్లలకు చిన్నప్పటి నుండే అన్నీ నేర్పించాలి.
We have to make our children from the childhood learn all the things.
Have to questions :
" Do " "does" ని add చేయాలి.
I
We
You Do
They
He
She Does
It
నేను వెళ్ళాలి
I have to go.
నేను వెళ్ళాలా?
Do I have to go?
నేను ఎందుకు వెళ్లాలి?
Why do I have to go?
నీవు వెళ్లాలా?
Do you have to go?
నువ్వు ఎందుకు వెళ్లాలి?
Why do you have to go?
నేను ఎలా వెళ్లాలి?
How do I have to go?
గమనించగలరు:
ఇంతకుముందు have to sentences ఉపయోగించేటప్పుడు he, she, it లకు
has ఉపయోగించాము.
కానీ questions అడిగేటప్పుడు he, she, it లకు
Has ఉపయోగించము, have మాత్రమే ఉపయోగిస్తాము.
అతను వెళ్లాలా?
Does he have to go?
ఆమె వెళ్లాలా?
Does she have to go?
Have to make questions:
I
We
You do
They
He
She does
It
నేను వాళ్లకి నేర్పించాలి.
I have to make them learn (positive)
నేను వాళ్లకి నేర్పించాలా?
Do I have to make them learn?
నేను వాళ్లకి ఎందుకు నేర్పించాలి.?
Why do I have to make them learn?
ఆమె వాళ్ళకి నేర్పించాలా?
Does she have to make them learn?
ఆమె వాళ్లకు ఎందుకు నేర్పించాలి?
Why does she have to make them learn?
అతను వాళ్లకి నేర్పించాలా?
Does he have to make them learn ?
అతను వాళ్లకి ఎందుకు నేర్పించాలి?
Why does he have to make them learn?
Don't have to question's:
నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు.
I don't have to learn (positive )
నేను నేర్చుకోవలసిన అవసరం లేదా?
Don't I have to learn?
నువ్వు ఇక్కడికి రానవసరం లేదా?
Don't you have to come here?
ఆమె నేర్చుకోవలసిన అవసరం లేదా?
Doesn't she have to learn?
అతను వెళ్లవలసిన అవసరం లేదా?
doesn't he have to go?
అతను ఎందుకు వెళ్లవలసిన అవసరం లేదు?
Why doesn't he have to go?
Don't have to make questions:
నేను వాళ్లకి నేర్పించవలసిన అవసరం లేదు.
I don't have to make them learn (positive)
నేను వాళ్లకి నేర్పించవలసిన అవసరం లేదా?
Don't I have to make them learn?
నేను వాళ్లకి ఎందుకు నేర్పించవలసిన అవసరం లేదు?
Why don't I have to make them learn?
ఆమె వాళ్లకు నేర్పించవలసిన అవసరం లేదా? doesn't she have to make them learn?
అతను వాళ్లకి నేర్పించవలసిన అవసరం లేదా?
Doesn't he have to make them learn?
అతను వాళ్లకి ఎందుకు నేర్పించవలసిన అవసరం లేదు?
Why doesn't he have to make them learn.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know