Had to, learn English through Telugu

Had to, learn English through Telugu
 ఏదైనా ఒక పని చేయవలసి వచ్చింది అని తెలియజేయాలనుకుంటే had to ని ఉపయోగించాలి.
 వెళ్లాల్సి వచ్చింది
చూడవలసి వచ్చింది
రావాల్సి వచ్చింది, అటువంటి వాటికి Had to ను use చేస్తారు.

Subject+had to+verb1 + extra words

I had to stay there.
 నేను అక్కడ ఉండవలసి వచ్చింది.

She had to eat that food. 
ఆమె ఆ భోజనం తినాల్సి వచ్చింది.

We had to join that college.
మేము ఆ కాలేజ్ లో చేరాల్సి వచ్చింది. 

I don't have interest, but I had to talk to him.
నాకు ఆసక్తి లేదు, కానీ అతనితో మాట్లాడాల్సి వచ్చింది.

Then, I had to sing a song. 
అప్పుడు నేనొక పాట పాడాల్సి వచ్చింది.

నేను ఇక్కడకు రావాల్సి వచ్చింది. 
I had to come here. 

నేను నీకు ఉత్తరం వ్రాయాల్సి వచ్చింది.
 I had to write a letter to you. 

వాళ్లు వాళ్ల పిల్లలను ఇంగ్లీషు మీడియం స్కూల్లో చేర్పించాల్సి వచ్చింది.
They had to admit their children in E.M. School 

నేను అక్కడకు వెళ్ళవలసి వచ్చింది.
I had to go there.

 Had to make:

 అతనికి నేర్పించవలసి  వచ్చింది.
 I had to make Him learn

ఆమె వాళ్లకు నేర్పించవలసి వచ్చింది.
 She had to make them learn.

 అతను వాళ్లకు నేర్పించవలసి వచ్చింది
 He had to make them learn.

 వాళ్లు అతనికి నేర్పించవలసి వచ్చింది.
 They had to make him learn.

వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏



Post a Comment

If you have any doubts, please let me know