సర్ ఎడ్వర్ట్ బర్నెట్ టైలర్ (అమెరికా)
(1832-1917)
మానవ సామాజిక పరిణామాన్ని ఆవిష్కరించటంలో అవీరళకృషి సల్పిన మేధావుల్లో సర్ ఎడ్వర్డ్ బర్నెట్ టైలర్ ఒకరు. సాంస్కృతిక మానవ శాస్త్రానికి ఆయన ఆద్యుడు. ఇరవై మూడేళ్ళ వయసులో క్షయ వ్యాధి లక్షణాలు కనబడడంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి టైలర్ అమెరికా వెళ్ళాల్సి వచ్చింది.
1856లో క్యూబా రాజధాని హవానాలో హెండ్రిక్రిస్టితో పరిచయమయింది. పురావస్తు జాతుల అధ్యయన శాస్త్రాల్లో ఆసక్తి ఉన్న క్రిస్టి - మెక్సికో లోయలో శిథిలావస్థలో వున్న టాల్టెక్ సంస్కృతిని పరిశీలించటానికి తనతో రమ్మని కోరటం టైలర్ జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది.
అప్పటి నుంచి ఆదిమ మానవులు సంస్కృతిపై టైలర్ అధ్యయనం జీవితాంతం కొనసాగింది. నాగరిక, ఆదిమ సమాజాల సంస్కృతులను సంపూర్ణ మానవ ఆలోచనా వికాసంలో భాగంగానే అధ్యయనం చేయాలి. వర్తమానాన్ని అర్థం చేసుకోవటానికి గతం అవసరం నిరంతరం వుంటూనే వుంటుంది.
మానవ ప్రస్తానం అటవిక దశ నుండి నాగరిక దిశగా సాగింది. అందుకు ఆదిమ తెగల జీవితమే నిదర్శనం. తన నియంత్రణలో లేని ప్రాకృతిక, ఇతర సంఘటనలను వివరించడానికి ఆదిమ మానవుడు తత్వవేత్తగా కూడా వ్యవహరించాడు. అయితే వైజ్ఞానికంగా అతని ఆలోచనలు చాలా ప్రాధమికంగా వుండడంతో ఆ వివరణ లోపభూయిష్టంగా వుండేవి.
పరిమిత జ్ఞానం వల్ల ఆదిమ మానవుడు చెట్టు చేమలతో పాటు పుట్టలు, గుట్టలలో కూడా జీవం వుందని భావించాడు. చరాచర జగత్తు యావత్తు జీవంతో నిండి వుందనే భావనే ఆదిమ మానవుడి తొలినాటి మతం.
నాగరిక సమాజాల్లోని ఆధ్యాత్మిక, కళా రంగాలలోని ఉన్నతినే మనిషి నైపుణ్యం,నైతిక సద్వర్తనలను తెలుసుకోవటమే సంస్కృతీ అధ్యయనం యొక్క పరమావధి కావాలి.
ఆదిమ జీవితానికి చెందిన ఆచారాలు, విశ్వాసాలు, ఆధునిక ప్రపంచంలో ఇంకా నిలిచే వున్నాయి. వాటిని ఆధ్యయనం చేయటంవలన మన మూలాలను తెలుసుకోగలుగుతాం!శరీర ఛాయతో సంబంధం లేకుండా మనుషులందరూ ఒకే జాతి వారని భావించటంలో మనకిప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు.
19వ శతాబ్దం చివరిలో అలా కాదు. అప్పట్లో ఈ భావనకు చాలా వ్యతిరేకత వుండేది. పాశ్చాత్యులు, ఆసియా, ఆఫ్రికాల్లోని నాగరిక ప్రజలు, ఇతర ఖండాల్లోని తెగలపై ఆధిపత్యం నెలకొల్పుకున్న పరిస్థితుల్లో మనుష్యులందరూ భౌతికంగా, మానసికంగా ఒకే జాతి అని వాదించటం అంత తేలికయిన పని కాదు. టైలర్ పరిశోధనలతో మానవ
శాస్త్రం కొత్త పుంతలు తొక్కింది. ఆయన పుస్తకాలు చాలా విషయాలలో ఇప్పటికి ప్రామాణి
కాలుగానే ఉన్నాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know